ఇరాన్ భీకర దాడులు ! ఇజ్రాయెల్ కు మద్దతుగా రంగంలోకి అమెరికా, సిరియా..!

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సాగుతున్న యుద్ధంలో తాజాగా కీలక మలుపు చోటు చేసుకుంది. ఇరాన్ పై దాడుతో యుద్ధానికి తెరలేపిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఆ దేశం నుంచి తీవ్ర ప్రతీకార దాడులు ఎదుర్కొంటోంది. రాజధాని టెల్ అవీవ్ లోని కీలక ప్రాంతాపై ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ ఉక్కిరిబిక్కిరవుతోంది. అమెరికా నుంచి తెచ్చుకున్న ఆయుధాల సాయంతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై దాడులు చేస్తున్నట్లు చెబుతున్నా ఈ యుద్దంలో స్ధూలంగా ఇజ్రాయెల్ వెనుకబడినట్లే కనిపిస్తోంది.

ఇరాన్ తో అమెరికా అణు ఒప్పంద చర్చలు విఫలమైన తర్వాత ఇజ్రాయెల్ ఒక్కసారిగా ఆ దేశంపై దాడికి దిగింది. రాత్రికి రాత్రే వందలాది క్షిపణులు ప్రయోగించింది. దీంతో ఇరాన్ కూడా ప్రతిదాడికి దిగింది. ఇరాన్ లోని అణు స్ధావరాలతో పాటు అణు శాస్త్రవేత్తల్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్దం నానాటికీ విస్తరిస్తోంది. ఈ దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా అగ్నిగుండంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా, సిరియా రంగంలోకి దిగాయి.

after iran s massive strikes US and Syria entered into war in support of israel

ఇరాన్ దాడుల నుండి ఇజ్రాయెల్‌ను రక్షించేందుకు అమెరికా సైన్యం రంగంలోకి దిగింది. ఇప్పటికే పశ్చిమాసియాలో మోహరించి ఉన్న అమెరికా యుద్ధ నౌకల నుంచి ఆ దేశ ఆయుధ రక్షణ వ్యవస్థలు చురుగ్గా పనిచేస్తూ ఇరాన్ దాడుల్ని తిప్పికొడుతున్నాయి. యుఎస్ నేవీ షిప్‌లు ఇరానియన్ క్షిపణులను పేల్చేస్తున్నాయి. యుఎస్ యుద్ధనౌకల్లో ఆర్లీ బర్క్-క్లాస్ డిస్ట్రాయర్లు ఇజ్రాయెల్‌కు దగ్గరగా, మధ్యధరా సముద్రంలో మోహరించాయి. ఈ నౌకలు ఎస్ఎం-3 వంటి అధునాతన క్షిపణులను కలిగి ఉంటాయి. ఇవి భూమి పైన, అంతరిక్షంలో కూడా శత్రు క్షిపణులను కూల్చగలవు.

after iran s massive strikes US and Syria entered into war in support of israel

అలాగే అమెరికా రాడార్ కవరేజ్, ఉపగ్రహ ట్రాకింగ్‌ను కూడా ఇజ్రాయెల్ కు అందిస్తోంది. వీటిని ఉపయోగించుకుంటూ ఇరాన్ పై పైచేయి సాధించేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది. అమెరికా ఇప్పటికే థాడ్ వంటి శక్తివంతమైన ఆయుధ రక్షణ వ్యవస్థల్ని ఇజ్రాయెల్ కు పంపింది. ఎక్కడో ఎత్తున ఉన్న క్షిపణుల్ని సైతం ఇవి కూల్చేస్తాయి. అలాగే రియల్ టైమ్ లో అమెరికా, ఇజ్రాయెల్ దళాలు యుద్ధరంగంలో కలిసి పనిచేస్తున్నాయి.

మరోవైపు అమెరికాకు మిత్రదేశంగా ఉన్న సిరియా కూడా ఇజ్రాయెల్ కు మద్దతుగా రంగంలోకి దిగింది. సిరియాలో బషర్ అస్సాద్ ప్రభుత్వాన్ని కూల్చేసిన అమెరికా తమకు అనుకూలంగా ఉండే అహ్మద్-అల-షరా సర్కార్ సాయంతో ఇజ్రాయెల్ కు మద్దతిస్తోంది. ఒకప్పుడు రెబెల్ కమాండర్ గా ఉన్న ఆయన ఇప్పుడు ఇజ్రాయెల్ కు మద్దతుగా ఇరాన్ కు వ్యతిరేకంగా దాడులకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్ జెట్లు సిరియా మీదుగానే ఇరాన్ ను టార్గెట్ చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+