Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారతీయులకు బ్రిటన్ భారీ షాక్- ట్రంప్ తరహాలో-బస్సు దించి విమానం ఎక్కిస్తూ వీడియో..!

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం ఓవైపు భారీ ఎత్తున కొరడా ఝళిపిస్తోంది. ఇప్పటికే భారత్ తో పాటు పలు దేశాలకు చెందిన అక్రమ వలసదారుల్ని గుర్తించి అరెస్టులు చేసి స్వదేశానికి తమ విమానాల్లోనే పంపేస్తున్నారు.ఇది కొనసాగుతుండగానే అమెరికా మిత్రదేశం బ్రిటన్ కూడా ఇప్పుడు అదే బాట పట్టింది. స్వదేశంలో భారీగా అక్రమంగా పాగా వేసిన భారతీయ వలసల్ని గుర్తించేందుకు భారీ డ్రైవ్ చేపట్టింది.

బ్రిటన్ ప్రభుత్వం అమెరికా తరహాలోనే అక్రమ వలసదారులకు ఉపాధి కల్పించే భారతీయ రెస్టారెంట్లు, నెయిల్ బార్‌లు, కన్వీనియన్స్ స్టోర్‌ల, కార్ వాష్‌లను లక్ష్యంగా చేసుకుని ఇవాళ దేశవ్యాప్తంగా భారీగా తనిఖీలు చేపట్టింది. బహిష్కరించాల్సిన అక్రమ వలసదారులను బస్సు నుంచి దించి విమానం మెట్లు ఎక్కుతున్నట్లు చూపించే వీడియోను బ్రిటన్ హోమ్ ఆఫీస్ ఇవాళ విడుదల చేసింది. గత ఏడాది జులైలో లేబర్ పార్టీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దాదాపు 19వేల మంది శరణార్థులు, విదేశీ నేరస్థులు, బ్రిటన్ కు వచ్చిన నేరస్థులు ఉన్నట్లు తెలిపింది.

after US UK begins similar drive against Indian immigrants across the country for deportation

బ్రిటన్ లో ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు జనవరిలో మొత్తం 828 ప్రాంగణాలపై దాడులు చేసి 609 మందిని అరెస్టు చేసి రికార్డు సృష్టించాయి. గతేడాది జనవరితో పోలిస్తే ఈ దాడులు 48 శాతం పెరిగాయని అధికారులు తెలిపారు. అరెస్టుల సంఖ్య అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 73శాతం పెరిగిందని వెల్లడించారు. తాజాగా ఉత్తర ఇంగ్లండ్‌లోని హంబర్‌సైడ్‌లో ఉన్న భారతీయ రెస్టారెంట్‌ను ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీలు చేసి ఏడుగురిని అరెస్టు చేసి, మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు హోం ఆఫీస్ వెల్లడించింది.

ఇమ్మిగ్రేషన్ నిబంధనలు తప్పనిసరిగా అమలు కావాలని, చాలా కాలంగా ఆయా రెస్టారెంట్ల యజమానులు అక్రమ వలసదారులకు ఉపాధి కల్పించి దోపిడీ చేశారని అధికారులు చెప్తున్నారు. అలాగే చాలా మంది వ్యక్తులు చట్టవిరుద్ధంగా వచ్చి వీటిలో పని చేయగలిగారని పేర్కొంటున్నారు. వీరిపై ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పుడు అమెరికా అక్రమ వలసలపై కొరడా ఝళిపిస్తుండటంతో బ్రిటన్ కూడా అదే మార్గం ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+