ఎగిరే ట్యాక్సీల్లో గాలిలో ప్రయాణించవచ్చు
ఫ్రాన్స్: అతి త్వరలో గాలిలో రివ్వున దూసుకెళ్లే స్వయం నియంత్రిత ట్యాక్సీలు అందుబాటులోకి రాబోతున్నాయి. అందుకోసం ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్ కసరత్తులు చేస్తోంది. నగరాల్లో ట్రాఫిక్ ఇక్కట్ల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు.
ఈ ట్రాఫిక్ ఇక్కట్లకు చెక్ పెట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సుతో పని చేసే అటానమస్ ఫ్లైయింగ్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ఎయిర్ బస్ ప్రకటించింది. ఇవి అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని భావిస్తున్నారు.

ఇప్పటికే గూగుల్, ఉబర్, ఐబీఎం వంటి పలు సంస్థలు స్వయం నియంత్రిత వాహనాలను తయారు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే డ్రైవర్ లెస్ కార్లను, బస్సులను రోడ్లపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎయిర్ బస్ మరో అడుగు ముందుకేసి ఎగిరే ట్యాక్సీలకు రూపకల్పన చేస్తుంది.
వాటికి సిటీ ఎయిర్ బస్ అని నామకరణం చేశారు. ప్రయాణికులను, సరుకులను ఒకచోట నుంచి మరోచోటుకు చేరుస్తూ సిటీ ఎయిర్ బస్ సేవలందిస్తుంది. స్మార్ట్‌ఫోన్ సాయంతో ఇచ్చే కమాండ్‌తో ఈ సిటీ ఎయిర్ బస్ తిరుగుతుంది. వచ్చే ఏడాది తొలి డిజైన్‌ను పరీక్షించనుంది. మరో పదేళ్లలో ఎగిరే సిటీ ఎయిర్‌బస్‌లు పూర్తి స్థాయిలో ప్రయాణికుల ముందుకు రానున్నాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications