అమెరికాపై మరో దాడికి అల్ ఖైదా ప్లాన్-ముహుర్తం కూడా ఖరారు-ఈసారి ఆప్ఘనిస్తాన్ నుంచి
2001లో సెప్టెంబర్ 11న అమెరికాపై అల్ ఖైదా జరిపిన ఆత్మాహుతి దాడుల్ని అగ్రరాజ్యంతో పాటు ప్రపంచం ఎప్పటికీ మర్చిపోలేదు. దీనికి కౌంటర్ గానే ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల ప్రభుత్వాన్ని కూల్చి రెండు దశాబ్దాల పాటు అక్కడే పాగా వేసిన అమెరికా తాజాగా తిరిగి వెళ్లింది. ఇప్పుడు మరోసారి ఆప్ఘన్ లో ఏర్పడిన తాలిబన్ల ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని అల్ ఖైదా చెలరేగవచ్చని యూఎస్ లోని బైడెన్ సర్కార్ అంచనా వేస్తోంది. అంతే కాదు త్వరలో మరోసారి అమెరికాపై 9/11 తరహా దాడికి కూడా సిద్ధమవుతోందని నిఘా నివేదికలు చెప్తున్నాయి.

ఆప్ఘన్ లో మళ్లీ అల్ ఖైదా ఎంట్రీ
ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం స్ధానంలో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రెండు దశాబ్దాల క్రితం పాగా వేసిన తరహాలోనే మరోసారి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్ధ అల్ ఖైదా పాగా వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆప్ఘన్ లో ప్రవేశించిన అల్ ఖైదా ఉగ్రవాదులు సాధ్యమైనంత త్వరగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందుకోసం తాలిబన్ల ప్రభుత్వం నుంచి అందుతున్న మద్దతుతో పాటు పొరుగున ఉన్న పాకిస్తాన్ సహకారం కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రపంచ దేశాల్లో మరోసారి ఆందోళన పెరుగుతోంది. కనీసం ఏడాది నుంచి రెండేళ్లలో ఆప్ఘన్ లో అల్ ఖైదా తిరిగి బలపడే అవకాశాలున్నట్లు ప్రపంచదేశాలు అంచనా వేస్తున్నాయి.

అమెరికాలో పెరుగుతున్న ఆందోళన
అల్ ఖైదా దెబ్బను ప్రపంచ దేశాల్లో అందరి కంటే ఎక్కువగా రుచి చూసింది అమెరికానే. 2001 కంటే ముందు అగ్రరాజ్యంగా చెలామణి అయిన అమెరికాపై అల్ ఖైదా జరిపిన దాడులతో యూఎస్ వణికిపోయింది. అంతే కాదు ప్రపంచ దేశాల్లో చులకన కూడా అయిపోయింది. దీంతో ఇప్పటికీ అగ్రరాజ్యాన్ని ఆ చేదు జ్ఞాపకాలు వీడటం లేదు. ఇప్పుడు ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ అక్కడి నుంచి వచ్చేసినా, తమ నిఘా వర్గాల ద్వారా ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా యూఎస్ నిఘా వర్గాలు సేకరించిన నివేదికలు వారికి ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నట్లు తెలుస్తోంది.

త్వరలో అమెరికాపై అల్ ఖైదా మరో దాడి ?
ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో నెలకొన్న పరిస్దితుల్ని సద్వినియోగం చేసుకుంటూ తాలిబన్ల సహకారంతో మరోసారి ప్రపంచ పెద్దన్న అమెరికాను దెబ్బ కొట్టేందుకు అల్ ఖైదీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో 2001 సెప్టెంబర్ 11న జరిపిన దాడి తరహాలోనే అమెరికాపై మరో దాడి చేసేందుకు అల్ ఖైదీ ప్రణాళికలు రచిస్తున్నట్లు యూఎస్ ఇంటిలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. ఆప్ఘన్ లో అమెరికా నియమించిన గూడఛారుల ద్వారా ఈ సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో ఈ దాడి ఎప్పుడు ఎలా జరగబోతోందన్న ఆందోళన బైడెన్ సర్కార్ తో పాటు సాధారణ ప్రజల్లోనూ పెరుగుతోంది.

అల్ ఖైదా దాడికి ముహుర్తం కూడా ఖరారు ?
అమెరికాపై త్వరలో అల్ ఖైదా జరిపే దాడికి ముహుర్తం కూడా ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. యూఎస్ నిఘా వర్గాలు ఆప్ఘనిస్తాన్ లోని తమ విశ్వసనీయ గూఢచారుల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం వచ్చే ఏడాది లేదా తర్వాత ఈ దాడి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇద్దరు గూఢచారులు తాజాగా ఇంటిలిజెన్స్ వర్గాలు ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఉన్నతాధికారులతో పంచుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే రెండేళ్లలో అమెరికాపై మరో 9/11 తరహా దాడి జరగడం ఖాయమన్న భయాలు అమెరికాలో నెలకొంటున్నాయి. దీంతో ఈ దాడి జరగకుండా ఆపేందుకు కౌంటర్ ప్లాన్ సిద్ధం చేసే పనిలో అమెరికా రక్షణ వర్గాలు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ దేశాల నుంచే అమెరికాకు ముప్పు
అమెరికాకు ప్రస్తుతం ముప్పు పొంచి ఉన్న దేశాల జాబితాలో ఆప్ఘనిస్తాన్ తో పాటు యెమన్, సిరియా, సోమాలియా, ఇరాక్ కూడా ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ దేశాల్లో ఎక్కడి నుంచైనా అల్ ఖైదా విరుచుకుపడొచ్చన్న సంకేతాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయా చోట్ల నిఘాను మరింత పెంచాలని అమెరికాలోని బైడెన్ సర్కార్ ఆదేశాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ జాబితాలో మిగతా దేశాలతో పోలిస్తే ఆప్ఘనిస్తాన్ నుంచి దాడులకు అవకాశాలు ప్రస్తుతానికి కాస్త తక్కువగానే ఉన్నట్లు అమెరికా నిఘా అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో ఆప్ఘన్ కాకుండా మిగతా దేశాల నుంచి దాడులు జరిగే ప్రమాదం ఉన్నట్లు అమెరికా అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ దేశాలన్నింటిలోనూ నిఘాను మరింత పెంచేందుకు అగ్రరాజ్యం ప్లాన్ చేస్తోంది.

అమెరికా ఈసారి కౌంటర్ చేయగలదా ?
గతంలో 2001లో జరిగిన 9/11 దాడుల సందర్భంగా అమెరికాకు తగిలిన దెబ్బలతో ప్రపంచం దృష్టిలో అగ్రరాజ్యం పరువంతా మంటగలిసింది. పైకి అగ్రరాజ్యంగా చెప్పుకుంటూ మిగతా దేశాలకు ఆయుధాలు అమ్ముకునే అమెరికా 9/11 దాడుల్ని మాత్రం అవే ఆయుధాలతో ఎందుకు ఎదుర్కోలేకపోయిందనే విమర్శలు వచ్చాయి. దీంతో ఈసారి అలాంటి దాడులు జరగకుండా అమెరికా ఇంటిలిజెన్స్ తో పాటు రక్షణ విభాగాలు కూడా కౌంటర్ వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. అయినా అల్ ఖైదా మారిన పరిస్ధితుల్లో ఎటునుంచి విరుచుకుపడుతుందో తెలియని పరిస్ధితులు ఉన్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో నిఘా వర్గాల సమాచారాన్ని డీకోడ్ చేసే పనిలో బైడెన్ సర్కార్ బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications