గాల్లో విమానం డోర్ తెరవబోయిన ప్రయాణీకుడు
వాషింగ్టన్: విమానంలోని ఓ ప్రయాణికుడు అది వేల అడుగుల ఎత్తులో ఉండగా దాని తలుపు తెరిచే ప్రయత్నం చేశాడు. దీంతో తోటి ప్రయాణీకులు, క్యాబిన్ క్రూకు ముచ్చెమటలు పట్టింది. ఈ సంఘటడన అమెరికాలో జరిగింది.
దీంతో విమానాన్ని అత్యవసరంగా దించేశారు. న్యూయార్క్ నుంచి సీటెల్ వెళ్తున్న అలస్కా ఎయిర్ లైన్స్ విమానంలో ఇది జరిగింది. సీటెల్ వెళ్లేందుకు న్యూయార్క్ విమానాశ్రయం నుంచి బోయింగ్ విమానం బయలుదేరింది.

కాసేపటికే ఓ ప్రయాణికుడు విచిత్రంగా ప్రవర్తించి, విమానం వెనుక డోర్‌ను తీసేందుకు యత్నించాడు. డోర్ తెరుచుకోలేదు.అప్రమత్తమైన సిబ్బంది ఎయిర్ లైన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. విమానాన్ని సమీపంలోని ఎయిర్ పోర్టులో దించారు. ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని గుర్తించి, ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications