అమెజాన్ ఉద్యోగులకు షాక్: వందల మందిని సాంగనంపుతారట!..

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అమెజాన్ సంస్థ త్వరలోనే తమ కంపెనీ ఉద్యోగులను తగ్గించుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తొలగింపుల ప్రక్రియపై దృష్టి సారించిన అమెజాన్.. కొన్ని వందల మంది ఉద్యోగులను తప్పించబోతున్నట్టు సమాచారం.

తొలగింపు ప్రకియలో భాగంగా.. అమెరికాలోని సీటెల్‌ కంపెనీ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల పైనే వేటు పడొచ్చు అంటున్నారు. ఆ కార్యాలయం నుంచే ఎక్కుమందిని తొలగించడానికి అమెజాన్ సిద్దపడుతున్నట్టు తెలుస్తోంది.

Amazon laying off corporate employees in rare cutback

గతేడాది అమెజాన్‌ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,30,000 మంది ఉద్యోగుల్ని కొత్తగా చేర్చుకుంది. అయితే కంపెనీ పున:వ్యవస్థీకరణలో భాగంగా.. అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో ఉద్యోగుల్ని పెంచనున్నారు. అదే సమయంలో రిటైల్ ఉద్యోగుల్ని తగ్గించబోతున్నట్టు సమాచారం.

డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, వీడియో, వెబ్‌ సర్వీసెస్‌ క్లౌడ్‌, అమెజాన్‌ ఎకో డివైజెస్‌ వంటి విభాగాల్లో కొత్తగా ఉద్యోగుల్ని నియమించడానికి కంపెనీ కసరత్తులు ప్రారంభించినట్టు చెబుతున్నారు. ఈ ఏడాది కంపెనీ పున:వ్యవస్థీకరణలో భాగంగానే కొత్త ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని అమెజాన్‌ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఈ నేపథ్యంలోనే తొలగింపులు, నియమాకాలు చేపట్టబోతున్నామన్నారు.
ఎవరైతే తొలగించబడుతారో.. వారిని తిరిగి కొత్త విభాగాల్లో నియమించడానికి ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Amazon is cutting several hundred jobs in Seattle, and hundreds elsewhere, a rare layoff that appears to fall predominantly on its established consumer retail business. The company continues to hire aggressively in other areas

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి