ఉక్రెయిన్ కోసం అమెరికా చేసిందేమీలేదు.. జో బైడెన్‌పై ఉక్రెయిన్ ఎంపీ ఇన్నా సోవ్‌సన్ ఫైర్ !!
ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని కీవ్, కార్కీవ్, మరియుపోల్ నగరాల్లో బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్‌కు చెందిన చమురు, ఆహార ఉత్పత్తి చేసే ప్రాంతాలపై దాడులకు దిగుతోంది. మరియుపోల్‌లో పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయి. కార్వీవ్‌లో పౌరులే లక్ష్యంగా మాస్కో సేనలు విరుచుకుపడుతున్నాయని ఉక్రెయిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆహారం కోసం క్యూలో నిల్చున్న ప్రజలపై రష్యా దళాలు బాంబులతో దాడులకు దిగాయని తెలిపారు. ఈ దాడుల్లో ఆరుగురు పౌరులు మృతి చెందారు. అటు లీవ్ నగరంపై క్షిపణులతో దాడులకు దిగిందని చెప్పారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. రష్యా సేనలు ఉక్రెయిన్ బలగాలు దీటుగా ఎదుర్కొంటున్నాయి.

జో బైడెన్ ఉక్రెయిన్‌కు ఏ సాయం చేయలేదు..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యూరప్ పర్యటనలో భాగంగా పోలాండ్‌లో పర్యటించారు. అక్కడ ఉక్రెయిన్ శరణార్థులతో ముచ్చటించారు. రష్యా దాడులపై పోలాండ్ నేతలతో పాటు ఉక్రెయిన్ ఆగ్రనేతలో బైడెన్ చర్చించారు. అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రసంగంపై ఉక్రెయిన్ ఎంపీ ఇన్నా సోవ్‌సన్ విరుచుకుపడ్డారు . ఆయన మాటలు ఉక్రెయిన్‌కు భరోసా కల్పించేలా లేవని ఆరోపించారు. గత నెలరోజులుగా రష్యా దాడులు చేస్తున్నా.. జో బైడెన్ తమకు చేసిందేమి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికాకు చురకలు
రష్యా దాడులను ప్రతిఘటించేందుకు ఉక్రెయిన్‌కు తగిన సహాయాన్ని అమెరికా అందించలేదని ఇన్నాసోవ్‌సన్ ఆరోపించారు. జో బైడెన్ కంటే పశ్చిమ దేశాలే తమకు ఎక్కువ సాయం చేస్తున్నాయని పేర్కొన్నారు. కేవలం పోలాండ్‌కు మద్దతుగానే బైడెన్ ప్రసంగం ఉందని ఉక్రెయిన్‌కు భరోసా ఇచ్చేలా లేదని మండిపడ్డారు. రష్యా దాడులు చేస్తోంది వార్సాలో కాదంటూ ఎద్దేవా చేశారు. కీవ్, ఖార్కీవ్, మరియుపోల్ లో రష్యా సేనలు విధ్వంసం సృష్టిస్తున్నాయని విరుచుకుపడ్డారు.

శ్వశానంలా ఉక్రెయిన్ నగరాలు
ఉక్రెయిన్ నగరాలను రష్యా దళాలు శ్మశానంలా మార్చుతున్నాయని ఎంపీ ఇన్నాసోవ్‌సన్ విరుచుకుపడ్డారు. మాస్కో సేనల విధ్వంసాలను సంబంధించిన చిత్రాలను ట్విట్ చేశారు. రూబిజ్నే, లుహాన్స్క్ ప్రాంతాల్లో క్షిపణులతో దాడులకు దిగాయని తెలిపారు. రానున్న రోజుల్లో రసాయన దాడులకు దిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా దురాక్రమణను అడ్డుకట్ట వేసేందుకు ఐరోపా దేశాలు యుద్ధ సాయాన్ని పెంచాలని కోరారు.












Click it and Unblock the Notifications