పండుటాకులా వణికిపోతున్న అమెరికా..!అగ్రరాజ్యాన్ని కకావికలం చేస్తున్న మంచుతుపాను..!
కొల్రాడ్/హైదరాబాద్ : ఇప్పడు అగ్రరాజ్యం అమెరికాను మంచు తుపాను వణికిస్తోంది. అమెరికా అతలాకుతలం అవుతోంది. మంచుతుఫాన్లు, బీబత్సమైన గాలులతో పండుటాకులా గజగజ వణికిపోంతోంది. రాకీ పర్వతాల నుంచి భారీగా చలిగాలులు వీస్తున్నాయి. దీంతో 25 రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. గంటకు 148 కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీయడంతో ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వేల సంఖ్యలో విమానాలు కూడా రద్దయ్యాయి. అంతేకాదు స్కూళ్లు , వ్యాపార సంస్థలు కూడా మూతపడ్డాయి.
కొన్ని చోట్ల పిడుగులు కూడా పడడంతో చాలా చోట్ల విద్యుత్తు సరఫరా కూడా నిలిచిపోయింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మంచు తుపానుపై అధికారిక హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా తుపానును బాంబ్ తుపానుగా వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోవడంతో అధికారులు సహాయక చర్యలను చేపట్టారు. శిథిలాల నుంచి ప్రజలను రక్షించి ఆసుపత్రికి తరలించారు. తుపాను కారణంగా భారీ వర్షాలు కురిసే కూడా అవకాశాలు ఉండటంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు.

-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications