అమెరికాలో మహిళ హత్య.. హైదరాబాద్‌లో వ్యక్తి అరెస్ట్

America’s most wanted fugitive arrested in Hyderabad
హైదరాబాద్: ఓ హత్య కేసులో శిక్షపడి తప్పించుకు తిరుగుతున్న అమెరికాకు చెందిన అమిత్ ముద్దమల్లి లివింగ్‌టన్‌ను సిఐడి అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అమెరికాలో ఓ మహిళను హత్య చేసిన కేసులో అతను నిందితుడు.

అతను హైదరాబాద్ వచ్చాడు. నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. సమాచారం మేరకు ... అమెరికాలో మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్‌గా పని చేస్తున్న లివింగ్‌స్టన్ అమిత్ ముద్దమాలె (46) గతంలో ఫ్లొరిడా, రాక్‌పాట్, టెక్సాస్‌లో నివసించేవాడు.

డల్లాస్, హూస్టన్, చికాగోలోని స్నేహితులు, బంధువుల ఇళ్ల వద్దకు రాకపోకలు సాగించేవాడు. ఈ క్రమంలోనే లివింగ్‌స్టన్‌కు వివాహిత హెర్మిల హెర్నాడ్స్(32)తో పరిచయం ఏర్పడి సాన్నిహిత్యం ఏర్పడింది. తర్వాత ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2005లో లివింగ్‌స్టన్.. హెర్నాడ్స్‌ను తుపాకీతో కాల్చి చంపాడు.

అనంతరం మృతదేహాన్ని ఓ బీచ్‌లో పడేశాడు. అప్పటినుంచి తప్పించుకుతిరుగుతున్నాడు. కుళ్లిన దశలో హెర్నాడ్స్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అమెరికా పోలీసులు లివింగ్‌స్టన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంటర్‌పోల్ అధికారులు రెడ్‌కార్నర్ నోటీసు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో శనివారం లివింగ్‌స్టన్‌ను గుర్తించి అరెస్టు చేశారు. అతనిని చర్లపల్లి జైలుకు తరలించారు.

హత్య చేసిన నేరంపై లివింగ్‌టన్‌కు టెక్సాస్‌లోని కామెరున్ న్యాయస్థానం 23 సంవత్సరాల శిక్ష విధించింది. దీనిలో భాగంగా నిందితుడు 2007 ఏప్రిల్ 14న కామెరూన్ కౌంటీ కార్యాలయంలో లొంగిపోవాల్సి వచ్చింది. అక్కడ హాజరుకాకపోగా తప్పుడు ధృవీకరణపత్రాలు, పాసుపోర్టుతో తప్పించుకొని భారతదేశం వచ్చాడు. దీనికి సంబంధించి 2008లోనే ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+