వాట్ అన్ ఐడియా మేడం.. చనుబాలు అమ్ముతూ లక్షల్లో సంపాదన !
ప్రతి మహిళ జీవితంలో తల్లి కావడం అనేది ఒక గొప్ప అనుభూతి. మాతృమూర్తిగా మారడం అనేది మానవ సంబంధాల కారణంగానే అయినప్పటికీ.. దైవానుగ్రహం కూడా తప్పనిసరి అని విశ్వసిస్తారు. గర్భధారణ, ప్రసవం అనుభవాలు ఎంతగానో శారీరక, మానసికంగా కష్ట పెట్టినా కూడా బిడ్డ కోసం అన్నింటిని భరిస్తారు. తల్లికి బిడ్డ జననం జరిగిన క్షణమే అన్ని బాధలు మాయమైపోతాయి. ఆ మరపురాని క్షణాలను బిడ్డను చూసినప్పుడే. అదే విధంగా కన్నబిడ్డను తొలిసారి చనుబాలతో కడుపునింపినప్పుడు వచ్చే ఆనందం, సంతోషం మాటల్లో వర్ణించలేము. తల్లి పాలు కేవలం ఆహారం లాగా మాత్రమే కాకుండా.. బిడ్డకు రోగనిరోధక శక్తిని, పెరుగుదలను అందించే అమృతంతో సమానంగా భావిస్తారు.
అయితే కొంతమందికి పాలు రావడం చాలా తక్కువగా ఉండటం.. లేదా ఎక్కువగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. మరికొంతమందికి అయితే అస్సలు పాలు రాకపోవడం కూడా జరుగుతాయి. హార్మోన్ల అసమతుల్యత, శరీర బలహీనత, శస్త్రచికిత్సల ప్రభావం.. మానసిక ఒత్తిడి వంటి కారణాలతో ఇలా జరగవచ్చని చెబుతారు. అలాంటి పరోస్థితుల్లో తల్లులు తమ బిడ్డల పెంపకం కోసం పశువుల పాలు లేదా డబ్బా పాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది.

సమస్య నుంచి బెస్ట్ ఐడియా..
అమెరికా మిన్నిసోటాలో నివసించే 33 ఏళ్ల ఇమిలీ ఎంజర్.. ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకి హైపర్ లాక్టేషన్ ( Hyperlactation ) సమస్య ఉండటంతో రోజుకి సుమారు 100 ఔన్సుల అదనపు పాలు ఉత్పత్తి అవుతున్నాయి. మొదట ఈ సమస్యతో ఇబ్బంది పడిన ఆమె.. దీన్ని అవకాశంగా మార్చుకుంది.
అదనపు పాలను స్టోర్ చేసి, సోషల్ మీడియా ద్వారా అమ్మడం ప్రారంభించింది. ఫేస్‌బుక్‌లో తాను అమ్మే పాల వివరాలను పోస్టు చేస్తూ, అవసరమైన వారు ఆమెను సంప్రదించేలా చేస్తోంది. పాలు రాని తల్లులు, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేస్తున్న మహిళలు కూడా ఇమిలీ పాలను కొనుగోలు చేస్తున్నారు.
లక్షల్లో ఆదాయం...
ఈ రకంగా ఇమిలీ నెలకు సుమారు 87,000 రూపాయలు (అమెరికన్ డాలర్లలో) సంపాదిస్తోంది. సంవత్సరానికి రూ.10 లక్షలకు పైగా ఆదాయం వస్తున్నట్టు సమాచారం. ఇమిలీ మాట్లాడుతూ.. తల్లి పాలలో అసాధారణమైన పోషక విలువలు ఉన్నాయని.. ఇవి ఏ వయసు వారికైనా ఉపయోగకరంగా ఉంటాయని తెలిపింది. తన వల్ల మరొక బిడ్డకు ఆరోగ్యం అందుతుందంటే తనకే ఆనందంగా ఉందని చెప్పింది.

Hyperlactation సిండ్రోమ్..
సాధారణంగా కొంతమంది తల్లులకు.. అవసరానికి మించి పాలు ఉత్పత్తి అవుతాయి. ఆ కారణం వల్ల తల్లి, బిడ్డ ఇద్దరికీ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. దీన్ని "Hyperlactation Syndrome"గా చెబుతారు. అందువల్ల నొప్పులు, ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం కూడా పొంచి ఉంటుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
తల్లి పాలలో ఉండే పోషకాలు..
హై ప్రోటీన్లు, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్లు
వైరస్‌లు, బాక్టీరియా నుంచి రక్షించే యాంటీబాడీలు
శిశువు మేధస్సు ఎదుగుదలకు అవసరమైన ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు
తేలికగా జీర్ణమయ్యే పోషకాలు
శిశువుల్లో అలెర్జీలు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల అవకాశాన్ని తగ్గించే గుణాలు ఉంటాయి
-
ఎండాకాలం చన్నీళ్ళ స్నానం చేస్తున్నారా? -
టేస్టీ టేస్టీ "బెండకాయ మటన్ కర్రీ" ఎలా చేయాలంటే..? -
ఈ "చామదుంపల బిర్యానీ" ముందు నాన్ వెజ్ బిర్యానీలు కూడా తక్కువే !! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications