వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌ కు టిక్‌ టాక్‌ ఝలక్‌- అమెరికాలో యాప్‌ నిషేధించినా వెబ్‌సైట్‌ నడిపించాలని నిర్ణయం...

|
Google Oneindia TeluguNews

చైనాతో వాణిజ్య యుద్ధంలో భాగంగా ఆ దేశానికి చెందిన టిక్‌ టాక్‌ యాప్‌పై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయానికి టిక్‌ టాక్ భారీ కౌంటర్‌ ఇచ్చింది. అమరికాలో యాప్ నిషేధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఉల్లంఘిస్తూ వెబ్‌ సైట్‌ నిర్వహించేందుకు సిద్దమని ప్రకటించింది. దీంతో ట్రంప్‌కు భారీ షాక్‌ తగిలినట్లయింది.

Recommended Video

TikTok : అమెరికాలో యాప్‌ నిషేధించినా ఏదో దారిలో ప్రజలను అలరిస్తాం ! - American TikTok Chief

గత నెలలో భద్రతా కారణాలతో చైనాకు చెందిన టిక్‌ టాక్‌ యాప్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్‌ సర్కారు... ఆ తర్వాత దాన్ని అమెరికన్ సంస్ధలకు అమ్మేయాలని ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టింది. అయితే ఈ ఒత్తిళ్లకు చైనా లొంగలేదు. ఓ దశలో మైక్రోసాఫ్ట్‌ చర్చలకు పిలిచినా టిక్‌ టాక్‌ సిద్ధపడలేదు. దీంతో అమెరికా సర్కారుతో ముఖాముఖీకి టిక్‌ టాక్‌ సంస్ధ సిద్ధమైనట్లు తేలిపోయింది. తాజాగా దీనికి కొనసాగింపుగా టిక్‌ టాక్‌ మరో ప్రకటన చేసింది. యాప్‌ లేకపోయినా తమ వెబ్‌సైట్‌ కొనసాగుతుందని అమెరికా టిక్‌ టాక్‌ ఛీఫ్‌ వెనెస్సా పప్పాస్‌ చేసిన ప్రకటన ఇప్పుడు కలకలం రేపుతోంది.

american tiktok chief says will run website eventhough trump bans mobile app

టిక్‌టాక్‌కు అమెరికాలో దాదాపు లక్ష మంది ఉద్యోగులు ఉన్నారు. టిక్‌ టాక్‌ మూతపడటం కారణంగా వీరంతా ఉద్యోగాలు కోల్పోయే పరిస్ధితి తలెత్తింది. అయితే యాప్‌ మూతపడినా తాము వెబ్‌ సైట్‌
తో పాటు మ్యూజిక్‌ యాప్‌ హిట్‌ ను కూడా కొనసాగిస్తామని టిక్‌ టాక్‌ యాజమాన్యం చేసిన ప్రకటన ఉద్యోగుల్లో సంతోషం నింపగా.. అమెరికాతో పాటు చైనాలోనూ చర్చనీయాంశమవుతోంది. అమెరికాతో గతంలో వాణిజ్య యుద్ధం నడిపిన చైనా ఈ ప్రకటన వెనుక ఉందనే వాదన వినిపిస్తోంది. అయితే అమెరికా టిక్‌టాక్‌ ఛీఫ్ ప్రకటనపై ట్రంప్‌ సర్కారు ఇంకా స్పందించాల్సి ఉంది.

English summary
chinese mobile app tiktok's american chief vanessa pappas announced that thier website will continue despite president trump's ban on app.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X