ఉద్యోగం ఊడగొట్టారని విమానాన్నే ధ్వంసం చేశాడు(వీడియో)
మాస్కో: ఏ ఉద్యోగి అయిన తనను ఉద్యోగం నుంచి తొలగిస్తే.. కొంత నిరాశకు గురవుతాడు. ఆ తర్వాత మరో ఉద్యోగం కోసం అన్వేషిస్తాడు. కానీ ఇక్కడ అలా జరగలేదు.
తన ఉద్యోగం పీకేసినందుకు సంస్థపై పగతీర్చుకున్నాడో మాజీ ఉద్యోగి. ఉద్యోగం నుంచి తొలగించిన కోపాన్ని ఆ వ్యక్తి సంస్థకు చెందిన విమానంపై చూపాడు. భారీ క్రేన్‌తో దాన్ని ధ్వంసం చేశాడు.

వివరాల్లోకి వెళితే.. రష్యాకు చెందిన యుటి ఎయిర్లెన్స్ విమాన సంస్థ ఓ ఉద్యోగిని విధుల నుంచి తొలగించింది. దీంతో అతగాడు తన కోపాన్ని ఆ సంస్థపైనే ప్రదర్శించాడు.
మిలియన్ డాలర్ల ఖరీదైన యుటి ఎయిర్లెన్స్ విమానాన్ని భారీ డిగ్గర్‌తో ముక్కలు చేసి తన కసి తీర్చుకున్నాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.












Click it and Unblock the Notifications