వణికించిన పెను భూకంపం: రోడ్ల మీదికి జనం పరుగులు
టోక్యో: జపాన్‌ను మరోసారి పెను భూకంపం సంభవించింది. హొక్కాయిడోను వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా రికార్డయింది. జపాన్ ఉత్తర ప్రాంతంలో ఉంటుందీ హొక్కాయిడో. అక్కడి నెమురో రీజియన్‌లో భూమి ప్రకంపించింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6:55 నిమిషాలకు ఈ భూకంపం సంభవించినట్లు జపాన్ మెటెరొలాజికల్ ఏజెన్సీ తెలిపింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీన ఇదే ప్రాంతంలో భూకంపం నమోదైంది. ఇప్పుడు మళ్లీ అదే రీజియన్‌ను వణికించింది. నెమురో రీజియన్‌లోని హొక్కాయిడో సమీపంలో గల ఉరకవ-చో పట్టణాన్ని భూకంప కేంద్రంగా అధికారులు గుర్తించారు. ఉరకవ టౌన్ వద్ద ఉపరితలం నుంచి 123 కిలోమీటర్ల లోతున భూ ఫలకాల్లో సంభవించిన పెను కదలికల వల్ల భూకంపం సంభవించినట్లు తెలిపారు.

భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రోడ్ల మీదికి పరుగులు పెట్టారు. ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదు. ఉరకవ టౌన్‌లో కొన్ని చోట్ల భవనాలకు బీటలు ఏర్పడినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సుమారు 20 నుంచి 30 సెకెన్ల పాటు భూమీ కంపించింది. ప్రధాన భూకంపం తరువాత కూడా కూడా స్వల్పస్థాయిలో ప్రకంపనలు నమోదు కావడంతో ఇళ్లల్లోకి వెళ్లడానికి స్థానికులు భయపడ్డారు. ఈ భూకంప తీవ్రత తీర ప్రాంత నగరాలైన ఇకెడ, టొయొకొరొ, ఒబిహిరో.. వంటి ప్రాంతాల్లో భారీగా కనిపించింది. ఉరకవ తీర ప్రాంత పట్టణమే అయినప్పటికీ.. ఎలాంటి సునామీ హెచ్చరికలను అధికారులు జారీ చేయలేదు.
జపాన్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో ఉండే దేశాల్లో ఇదీ ఒకటి. బొలీవియా, చిలీ, ఈక్వెడార్, పెరూ, కోస్టారికా, గ్వాటెమాల, మెక్సికో, అమెరికా, కెనడా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, పాపువా న్యూగినియా, ఇండోనేషియా, న్యూజిలాండ్, అంటార్కిటికా- ఈ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉన్నాయి.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications