భారత్ ను అతిపెద్ద దెబ్బతీయబోతున్న ట్రంప్ ? ఈసారి ఈ రంగంపై..!

అమెరికా ఫస్ట్ నినాదంతో దూకుడుగా ముందుకెళ్తున్న అధ్యక్షుడు ట్రంప్ ఈ క్రమంలో ఏ దేశాన్నీ వదిలిపెట్టేలా కనిపించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలపై ఇప్పటికే ట్రంప్ నిర్ణయాలు తీవ్ర ప్రభావం చూపుతుండగా.. ఇప్పుడు తాజాగా ఆయన మరో ప్రకటన చేసారు. దీంతో భారత్ ఎగుమతులపై ఆధారపడిన ఆ కీలక రంగం తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అప్పుడే మన దేశంలో తయారీ, ఎగుమతిదారులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ఇప్పటివరకూ ప్రతీకార పన్నులతో వివిధ దేశాలను టార్గెట్ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు మరో కొత్త రంగంపై విరుచుకుపడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు కీలక ప్రకటన కూడా చేసారు. ఫార్మా రంగంపై ఈసారి భారీగా పన్నుల మోత ఉంటుందని ట్రంప్ చేసిన ప్రకటన ఇప్పుడు భారత్ సహా పలు దేశాలకు షాకిచ్చింది. ముఖ్యంగా అమెరికాకు ఫార్మా ఎగుమతుల్లో టాప్ లో ఉన్న భారత్ పై ట్రంప్ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపబోతోంది.

another setback to india as Donald trump plans to hike tariffs on pharma sector soon

తాజాగా నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెషనల్ కమిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ ఫార్మా రంగంపై త్వరలో భారీగా సుంకాలు పెంచబోతున్నట్లు తెలిపారు. ఈ సుంకం ఔషధ కంపెనీలు తమ కార్యకలాపాలను అమెరికాకు తరలించడానికి ప్రోత్సహిస్తుందని కూడా వెల్లడించారు. గతంలో ట్రంప్ ప్రభుత్వం ఔషధాలు, సెమీకండక్టర్లను దాని ప్రతీకార సుంకాల విధానం నుంచి దూరంగా ఉంచింది. కానీ ఇప్పుడు ట్రంప్ మనసు మార్చుకున్నారు.

Take a Poll

వాస్తవానికి భారతీయ ఔషధ ఉత్పత్తులకు భారతదేశం అతిపెద్ద ఎగుమతి మార్కెట్. గత ఆర్ధిక సంవత్సరంలో భారత్ 27.9 బిలియన్ డాలర్ల ఫార్మా ఎగుమతులు చేయగా.. ఇందులో 31 ​​శాతం లేదా అంటే 8.7 బిలియన్ డాలర్లు అమెరికాకు చేసినవే. అమెరికాలో వాడే జనరిక్ మందుల్లో 45 శాతం, బయోసిమిలర్ మందుల్లో 15 శాతం కంటే ఎక్కువ మనమే సరఫరా చేస్తున్నాం. డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, జైడస్ లైఫ్‌సైన్సెస్, సన్ ఫార్మా, గ్లాండ్ ఫార్మా వంటి సంస్థలు తమ మొత్తం ఆదాయంలో 30-50 శాతం వరకు అమెరికన్ మార్కెట్ నుండి సంపాదిస్తున్నాయి. ట్రంప్ తాజా నిర్ణయంతో వీరికి భారీగా షాక్ తగలబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+