Apple iPhone 15: మార్కెట్లో ఎంట్రీ- ధర, ఫీచర్లు ఇవే

వాషింగ్టన్: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న యాపిల్ ఐఫోన్ 15 విడుదలయింది. కొద్దిసేపటి కిందటే యాపిల్ తన లేటెస్ట్ వర్షన్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్‌లను లాంచ్ చేసింది. మార్కెట్లోకి గుమ్మరించింది. ఈ ఫోన్ విడుదలైన వెంటనే ఆన్‌లైన్ బుకింగ్ వెబ్‌సైట్ క్రాష్ అయిందంటే.. దీనికి ఉన్న డిమాండ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.

ఈ యాపిల్ ఐఫోన్ 15ను 75 శాతం రీసైకిల్ అల్యూమినియం, 100 శాతం రీసైకిల్ కోబాల్ట్‌తో తయారు చేశారు. దీని డిస్‌ప్లే 6.1, 6.7 అంగుళాలు. లేత గులాబీ, పసుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగుల్లో ఇది కనువిందు చేస్తోంది. 48-మెగా పిక్సెల్ కెమెరా, 26 ఎంఎం ఫోకల్ స్ట్రెంగ్త్ దీని ప్రత్యేకత. 100 శాతం ఫోకస్ పిక్సెల్‌లు, సెన్సార్-షిఫ్ట్ ఓఐఎస్ వంటివి ఇందులో అదనపు ఫీచర్లు.

Apple iPhone

ఐఫోన్ 15 ధర 66,215 రూపాయలు, ఐఫోన్ 15 ప్లస్ రేట్ 74,503 రూపాయల నుంచి ప్రారంభమౌతుంది. ఊహించినట్లుగానే యాపిల్ తన ఐఫోన్, అన్ని ఇతర ఉత్పత్తుల కోసం యూఎస్బీ-సీ ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా ప్రవేశపెట్టింది. డైనమిక్ ఛార్జింగ్ వ్యవస్థ ఇందులో అందుబాటులో ఉంది.

అన్ని మొబైల్ ఫోన్స్, టాబ్లెట్స్, కెమెరాలు తప్పనిసరిగా 2024 చివరి నాటికి యూఎస్బీ టైప్-సి ఛార్జింగ్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉండాలంటూ యూరోపియన్ యూనియన్ డిక్రీని జారీ చేసిన నేపథ్యంలో యాపిల్.. తన ఐఫోన్లకు ఈ ఆప్షన్ ఇచ్చింది. యూరోపియన్ యూనియన్ డిక్రీకి అనుగుణంగా భవిష్యత్తులో రాబోయే అన్ని గ్యాడ్జెట్స్‌కు యూఎస్బీ-సీ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+