ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌ ఈయనే.. ఖమేనీ కంటే డేంజర్..!

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఒకదానిపై మరొకటి క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసుకున్నాయి. అయితే ఇరాన్ పై జరిపిన దాడుల్లో సుప్రీ లీడర్ ఖమేనీ మృతి చెందినట్లు ఇరాన్ మీడియా ధృవీకరించింది. అంతేకాక ఈ దాడుల్లో ఖమేనీ కుమార్తె, మనవడు, కోడలు, అల్లుడు మరణించినట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన కేవలం 30 సెకన్లలోనే ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీతోపాటు పలువురు సీనియర్ అధికారులు హతం అయినట్టు సమాచారం. అయితే ఖమేనీ మరణంతో ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన వారసుడిగా అయతొల్లా అలిరెజా అరాఫీని ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా నియమించింది.

ఇజ్రాయెల్ - అమెరికా సంయుక్తంగా జరిపిన భారీ వైమానిక దాడుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆయన మరణాన్ని అటు ఇరాన్ మీడియాతోపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఖమేనీ మృతి నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సుప్రీం నాయకుడిగా సీనియర్ మతాధికారి ఆయతొల్లా అలిరేజా అరాఫీని నియమించినట్లు ఇరాన్ పేర్కొంది. ఆయన తాత్కాలిక సుప్రీం లీడర్‌ గా పనిచేస్తారని తెలిపింది. ఇక ఇస్లామిక్ విప్లవ నేత ఖొమేనీ మరణం అనంతరం.. 1989 నుంచి ఖమేనీ ఇరాన్ సుప్రీం నాయకుడిగా కొనసాగుతూ వచ్చిన విషయం తెలిసిందే.

ఇక ఇరాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 111 ప్రకారం.. సుప్రీం లీడర్ మరణించినప్పుడు లేదా తన విధులను నిర్వహించలేని సమయంలో ఒక Interim Leadership Council ను ఏర్పాటు చేస్తారు. ఈ మండలిలో ముగ్గురు సభ్యులు ఉంటారు. ఇందులో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, జ్యుడీషియరీ చీఫ్ గులాంహొస్సేన్ మొహసెని ఎజెయి, గార్డియన్ కౌన్సిల్ జ్యూరిస్ట్ ఉంటారు. ఇక ఇరాన్ రాజ్యాంగం ప్రకారం.. 88 మంది సభ్యులున్న అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌ పర్ట్స్ తదుపరి పూర్తిస్థాయి సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే వరకు ఈ కౌన్సిల్ బాధ్యతలు నిర్వహిస్తుంది.

Arafi Ayatollah Alireza Named Interim Supreme Leader of Iran next Senior Cleric Takes Charge

రష్యన్ మీడియా కథనం ప్రకారం.. అయతొల్లా అరాఫీ.. ఇరాన్‌ లోని అత్యంత శక్తివంతమైన మతపరమైన నాయకుల్లో ఒకరు. 1959లో ఇరాన్‌ లోని మేబోద్‌ లో జన్మించిన ఆయన షియా మతగురువుగా.. ఇస్లామిక్ న్యాయనిపుణుడిగా పేరు పొందారు. దేశ చట్టాలను, ఎన్నికలను పర్యవేక్షించే శక్తివంతమైన గార్డియన్ కౌన్సిల్‌లో కూడా ఆయన సభ్యుడిగా ఉన్నారు. అలాగే గతంలో ఖమేనీకి అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు అయతొల్లా అరాఫీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+