నేడే అధ్యక్ష ఎన్నికలు: బ్రిటన్ బాటలోనే ఫ్రాన్స్?
కొన్నేళ్లుగా ఫ్రాన్స్ ఉగ్రవాదుల లక్ష్యంగా మారిన నేపథ్యంలో ఆదివారం జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికలు ఐరోపా దేశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి.
పారిస్: కొన్నేళ్లుగా ఫ్రాన్స్ ఉగ్రవాదుల లక్ష్యంగా మారిన నేపథ్యంలో ఆదివారం జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికలు ఐరోపా దేశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పెరుగుతున్న అతివాద, సంకుచిత జాతీయవాద ధోరణి ఇటీవల కాలంలో ఫ్రాన్స్‌లోనూ ప్రబలంగా కనిపిస్తుండడంతో ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవిగా చెప్తున్నారు.
వలసలు, ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినట్లే, తామూ అవే విధానాలతో విజయం సాధించాలని పలువురు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఫ్రాన్స్ 'నేషనల్ ఫ్రంట్' అభ్యర్థి 'మారిన్ లీ పెన్' చాలాకాలంగా ఇదే భావజాలాన్ని ప్రస్ఫుటంగా వ్యక్తీకరిస్తున్నారు. ఫ్రాన్స్‌లో ఎప్పుడూ పార్టీలు, అభ్యర్థులు కేంద్రంగా ఎన్నికలు జరుగుతుంటాయి.
కానీ, ప్రస్తుత ఎన్నికలు విధానాల మధ్య పోటీగా నిలుస్తున్నాయి. దీంతో ఈ ఎన్నికలు కేవలం ఫ్రాన్స్‌కే కాకుండా మొత్తం ఐరోపా సమాఖ్య(ఈయూ), అమెరికా, ఇతర దేశాలకూ కీలకంగా మారాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య మునుపెన్నడూ లేనట్లుగా అత్యంత పటిష్ఠమైన భద్రత మధ్య ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గత రెండేళ్లుగా ఉగ్రవాద దాడులు పెరిగిపోవడం.. 2015 నుంచి ఇప్పటివరకు 239 మంది ఉగ్రవాదానికి బలి కావడం.. ఈ నెల 20న కూడా పారిస్‌లో ఓ పోలీసును ఉగ్రవాదులు హతమార్చడంతో గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.

బ్రెగ్జిట్ మాదిరిగానే ఫ్రెగ్జిట్‌కు డిమాండ్
ఇప్పటికే బ్రిటన్ యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బయటకు వచ్చేసింది. ఇక జర్మనీ, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, పోలండ్ తదితర దేశాలూ అదే గళం వినిపిస్తున్నాయి. ఫ్రాన్స్‌లో ఇప్పుడు ముందువరుసలో ఉన్న అభ్యర్థుల్లో ఒకరైన లీపెన్ సైతం ఈయూ నుంచి 'ఫ్రెగ్జిట్ (వైదొలగాలి)' అన్న డిమాండ్‌ను బలంగా వినిపిస్తుండటంతో ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల తరువాత పరిస్థితి ఏమిటన్న చర్చ జరుగుతున్నది. ఈయూ నుంచి వైదొలగడంతోపాటు ఉగ్రవాదం, వలసలు, శరణార్థుల విషయంలో గళం విప్పుతున్న లీ పెన్.. ఏటా 10 వేల మందికి మించి వలసదారులను అనుమతించరాదంటున్నారు.
లీపెన్ ప్రత్యర్థులు ఇమాన్యుయల్ మేక్రన్, జీన్ లక్ మాత్రం ఆయన వాదనలను వ్యతిరేకిస్తున్నారు. లీపెన్ ఇస్లాం వ్యతిరేక భావజాలంతో దేశాన్ని విడగొట్టాలని.. లౌకికత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ముగ్గురు అభ్యర్థుకు భిన్నంగా నాలుగో అభ్యర్థిగా ఉన్న ఫ్రాంకోయిస్ ఫిలాన్ మాత్రం ఆర్థిక, సామాజిక సంక్షోభం నుంచి ఫ్రాన్స్‌ను గట్టెక్కించడమే ప్రధాన ధ్యేయమంటున్నారు. ఈయూలో కొనగేందుకు తాను అనుకూలమని చెప్తున్నారు. ఇటీవల జరిగిన సర్వేలో లీపెన్, ఇమాన్యుయల్ మేక్రన్ 23 శాతం.. జీన్‌లక్ 19.5 శాతం, ఫ్రాంకోయిస్ ఫిలాన్ 19 శాతం ఓట్లు సాధిస్తారని అంచనాలు వెలువడ్డాయి.
రెండు దఫాల్లో పోలింగ్
ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు రెండు విడుతల్లో జరుగుతాయి. ఈ నెల 23 (ఆదివారం)తోపాటు వచ్చేనెల ఏడో తేదీన పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ముగిసిన వెంటనే అంచనాలు వెలువడతాయి. ఆ మరుసటి రోజే ఫలితాలు వస్తాయి. వచ్చేనెల 14న ఫ్రాన్స్ నూతన అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా, ప్రధాన పోటీ దారులు మాత్రం నలుగురే. 4.68 కోట్ల మంది ఓటర్లు తమ తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.
పుదుచ్చేరి, పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ఫ్రాన్స్ దేశస్థులు ఆ దేశంలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఇక్కడ తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. పుదుచ్చేరి, కారైక్కాల్, మహే, యానాంలలోని ఫ్రెంచి కాలనీలలో ఉంటున్న పురుషులు, మహిళలతో పాటు మొత్తం 4,600 మంది ఆదివారం ఓటు వేయనున్నారు. ఇందుకు పుదుచ్చేరి, చెన్నై, కారైక్కాల్‌లలో నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఆదివారం ఉదయం 8.00 గంటల నుంచి రాత్రి 7.00 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
స్వేచ్ఛకు సంకేతం బ్రెగ్జిట్
బ్రెగ్జిట్ తీర్పు స్వేచ్ఛకు సంకేతం అని నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి మారిన్ లీపెన్ వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్ సహా ఈయూ సభ్య దేశాల్లోనూ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈయూ నుంచి అసలు బ్రిటన్ కంటే ముందే ఫ్రాన్స్ బయటకు రావాల్సిందని అన్నారు. బురఖాను నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications