వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌పై హ‌త్యాయ‌త్నం!

|
Google Oneindia TeluguNews

రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌పై మరోసారి 'హత్యాయత్నం' జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారుపై 'బాంబు దాడి' జరిగింద‌ని, ఈ ప్ర‌మాదం నుంచి ఆయ‌న సుర‌క్షితంగా బ‌య‌ట ప‌డ్డార‌ని జనరల్‌ జీవీఆర్‌ టెలిగ్రామ్‌ ఛానల్ పేర్కొంది. ఇంటికి తిరిగొస్తున్న స‌మ‌యంలో పుతిన్ కారు ముందువైపు ఎడ‌మ చ‌క్రం భారీ శ‌బ్ధంతో పేలింద‌ని, అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది కారు నుంచి పొగ వ‌స్తున్న‌ప్ప‌టికీ ఆయ‌న్ను వేరే ప్రాంతానికి త‌ర‌లించార‌ని వెల్ల‌డించింది. పుతిన్ కు ఎటువంటి ప్ర‌మాదం సంభ‌వించ‌లేద‌ని, ఆయ‌న అధ్య‌క్ష నివాసానికి వెళ్లార‌ని తెలిపింది.

ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో పుతిన్ కాన్వాయ్‌లోని తొలి ఎస్కార్ట్ కారుకు అంబులెన్స్ అడ్డుగా రావ‌డంతో రెండోకారు ఆగ‌కుండా వెళ్లిపోయింది. ఈ ఘ‌ట‌న ఎప్పుడు జ‌రిగింద‌నేది తెలియ‌రాలేదు. ప్రమాదం జ‌రిగిన త‌ర్వాత మాత్రం ప‌లువురిని అరెస్ట్ చేశారు. అలాగే పుతిన్ సెక్యూరిటీ స‌ర్వీస్‌కు చెందిన అధికారుల‌ను అరెస్ట్ చేయ‌డంతోపాటు బాడీగార్డ్ స‌ర్వీస్ హెడ్‌తోపాటు ప‌లువురు ఉన్న‌తాధికారుల‌ను అదుపులోకి తీసుకున్నారు.

tittle assassination attempt russia president putin

ఉక్రెయిన్‌పై ర‌ష్యా సైనిక చ‌ర్య‌కు దిగిన త‌ర్వాత కొన్ని వ‌ర్గాల నుంచి ఆయ‌న‌కు వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. వారే దాడికి దిగివుంటారని అంత‌ర్జాతీయ మీడియా పేర్కొంది. ఇదే కాకుండా కొద్ది నెలల క్రితం కూడా పుతిన్‌పై హత్యాయత్నం జరిగినట్లు ఉక్రెయిన్ వెల్ల‌డించింది. కాకసస్‌ పర్యటనలో ఉన్న సమయంలో అక్కడి ప్రతినిధులు పుతిన్‌పై దాడి చేశార‌ని ఉక్రెయిన్‌ రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయాన్ని రష్యా రహస్యంగా ఉంచింది. తనపై హత్యాయత్నాలను 2017లో పుతిన్‌ స్వయంగా ప్రకటించారు.

English summary
There has been an 'assassination attempt' against Russian President Vladimir Putin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X