H-1B Visa పై గొప్ప ఊరట ఇచ్చిన ట్రంప్- గుడ్ న్యూస్

హెచ్ 1బీ వీసా వార్షిక ఫీజును 1,00,000 డాలర్ల పెంచిన తర్వాత.. కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఐటీ రంగంలో కలకలం చెలరేగింది. మైక్రోసాఫ్ట్, జేపీ మోర్గాన్ వంటి ఎమ్మెన్సీలు బయటి దేశాల్లో తమ ఉద్యోగులను హుటాహుటిన వెనక్కి పిలుపించుకున్నాయి.
ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి టెక్ దిగ్గజ సంస్థల్లో పని చేస్తోన్న ఉద్యోగులు కూడా ఇక స్వదేశానికి తిరుగుముఖం పట్టారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఐటీ రంగం తీవ్ర ప్రభావానికి లోనైందిజ.

ఈ పరిస్థితులను డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సమీక్షించింది. దీని తీవ్రతను తగ్గించింది. భారీ ఊరట ఇచ్చింది. పెంచిన లక్ష డాలర్ల ఫీజు కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే వీసా ఉన్నవారికి కాదని వైట్ హౌస్ వెల్లడించింది. హెచ్ 1బీ విసాపై ఇప్పటికే అమెరికాలో నివసిస్తోన్న వారికి లక్ష డాలర్ల ఫీజు వర్తించబోదని తేల్చి చెప్పింది. ఈ పెంపు కొత్త దరఖాస్తులకే మాత్రమేనని, ఇప్పటికే వీసా ఉన్నవారికి కాదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలినా లివిట్ స్పష్టం చేశారు.

Attention New 100K dollar H-1B Visa Fee Applies Only to New Applications

ఇది వార్షిక ఫీజు కాదనీ ఆమె తేల్చి చెప్పారు. ఒక దరఖాస్తుకు ఒకసారి మాత్రమే (వన్ టైమ్) లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం దేశం వెలుపల ఉన్న హెచ్-1బీ వీసాదారులకు తిరిగి స్వదేశానికి రావడానికి ఈ ఫీజు వర్తించబోదని వివరించారు.

అమెరికాను సందర్శించి తిరిగి వస్తున్నవారికి, లేదా భారత్‌ను సందర్శిస్తున్నవారికి ఈ ఆదివారం లోపు తిరిగి రావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ "Restriction on Entry of Certain Nonimmigrant Workers" పేరుతో కొత్త డిక్రీని జారీ చేశారు. దీంతో హెచ్-1బీ వీసా విధానంలో ప్రవేశపెట్టిన మార్పులు అమలలోకి వచ్చాయి. పెంచిన లక్ష డాలర్ల ఫీజు అమెరికా కాలమానం ప్రకారం.. సెప్టెంబర్ 21న అర్ధరాత్రి దాటిన తర్వాత 12:01 నిమిషాల నుంచి అమలులోకి వస్తుంది.

ఈ డిక్రీ అమలులోకి వచ్చాక హెచ్-1బీ ఉద్యోగులు విదేశాల్లో చిక్కుకుపోతారేమోనని ఆందోళన వ్యక్తం అయ్యాయి. వాళ్లందరూ అమెరికాలో అడుగు పెట్టాలంటే 1,00,000 డాలర్ల ఫీజును చెల్లించాల్సి వస్తుందని ఇమ్మిగ్రేషన్ అడ్వొకేట్ కంపెనీలు, టెక్ సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపైనా కరోలినా లివిట్ స్పష్టత ఇచ్చారు. ఇది నిజం కాదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం దేశం వెలుపల ఉన్న హెచ్-1బీ వీసాదారులకు తిరిగి స్వదేశానికి రావడానికి ఈ ఫీజు వర్తించబోదని వివరించారు.

పెంచిన వార్షిక ఫీజు.. కొత్త హెచ్-1బీ లాటరీ సైకిల్, కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుందని వివరించారు. ప్రస్తుత వీసాదారులకు లేదా రెన్యూవల్స్ కు వర్తించబోదని తెలిపారు. హెచ్-1బీ వీసా కార్యక్రమం కనీసం బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలని, అమెరికా కంపెనీలు దేశీయంగా భర్తీ చేయలేని అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను పూరించడానికి ఇది రూపొందించిందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+