వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌కు భంగపాటు: ముద్దు పెడుతోంటే.. చిన్నారి విముఖత

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ : అమెరికన్ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు బ్యాడ్ టైమ్ కంటిన్యూ అవుతోంది. తాజాగా ఓపెన్ డిబేట్ కార్యక్రమంలో భాగంగా.. మద్దతుదారులను ఆకట్టుకునేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ముద్దు కోసం ట్రంప్ మూతి జాపితే, చిన్నారి మాత్రం మొహం తిప్పేసుకుంది.

డిబేట్ లో భాగంగా.. స్టేజీపై నుంచి ప్రసంగిస్తోన్న సమయంలో.. తన మద్దతుదారు కూతురైన ఓ చిన్నారిని వేదిక మీదకు పిలిచాడు ట్రంప్. అంతకుముందు ఆ చిన్నారిని చూస్తూ.. 'బ్యూటీఫుల్' అంటూ పదే పదే వ్యాఖ్యానించాడు. చిన్నారి స్టేజీ మీదకు రాగానే ఆమెను చంకనెత్తుకుని ముద్దు ముద్దుగా మాటలు కలిపే ప్రయత్నం చేశాడు. అందరికీ హాయ్ చెప్పాల్సిందిగా ట్రంప్ ఆ చిన్నారికి సూచించినా.. చిన్నారి మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోలేదు.

 Donald Trump

అంతేకాదు, చిన్నారిని ముద్దాడే ప్రయత్నం చేయబోయిన ట్రంప్ కు.. ఆ విషయంలోను చేదు అనుభవమే మిగిలింది. ట్రంప్ చిన్నారి బుగ్గకు ముద్దు పెడుతున్న క్రమంలో ట్రంప్ ను నెట్టేసినట్లుగా.. తన రెండు చేతులను చిన్నగా విదిల్చింది చిన్నారి. ఇప్పటికే తన నోటి దురుసుతో బ్యాడ్ పబ్లిసిటీని మూటగట్టుకున్న ట్రంప్.. ఇప్పుడి చిన్నారితోను ఛీత్కారం ఎదుర్కొన్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

English summary
The Republican nominee - fighting a string of allegations he sexually assaulted women - was trying to pick up momentum with a speech in Green Bay, Wisconsin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X