మరో స్టూడెంట్ లీడర్ కాల్చివేత.. బంగ్లాదేశ్ లో ఏం జరుగుతోంది..?
బంగ్లాదేశ్ లో మరో స్టూడెంట్ లీడర్ పై కాల్పులు జరపడం కలకలం రేపుతోంది. నేషనల్ సిటిజెన్ పార్టీ నేత మెతలెబ్ సిగ్దార్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ప్రస్తుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఇటీవల ఇంకిలాబ్ మోంచో నేత షరీఫ్ హాదీ హత్యతో ఆందోళనలు హోరెత్తిన వేళ.. మరోసారి ఇలాంటి ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ కాల్పుల్లో హాదీ గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే.
ఇటీవల ఇంకిలాబ్ మోంచో నేత షరీఫ్ హాదీ హత్యతో ఆందోళనలు బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు హోరెత్తాయి. హాదీ మద్దతుదారులు, విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అవి ఇంకా తగ్గకముందే బంగ్లాదేశ్ లో మరో స్టూడెంట్ లీడర్ పై కాల్పులు జరపడం ఆందోళనకరంగా మారింది. నేషనల్ సిటిజెన్ పార్టీ నేత మెతలెబ్ సిగ్దార్ పై ఇవాళ ఉదయం సౌత్ వెస్ట్రర్న్ ఖులానా సిటీలోని అతని ఇంటిముందే గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో సిగ్దార్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. సిగ్దార్ ఎడమవైపు తీవ్రంగా గాయమైంది. హుటాహుటిన అతడ్ని ఆస్పత్రికి తరలించారు. రక్తం బాగా పోయింది. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. హాదీ హత్య జరిగిన కొద్ది రోజులకే ఇలాంటి ఘటన జరగడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోవడంలో స్టూడెంట్ లీడర్ హాదీ పాత్ర ముఖ్యమైంది. ఈ నెల 12 న అతడిపై కొందరు దాడి చేశారు. సెంట్రల్ ఢాఖాలోని బిజోయ్ నగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న అతడిపై మాస్కులు ధరించిన కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో అతడి పరిస్థితి విషమంగా మారింది. దాంతో అతడ్ని మెరుగైన వైద్యం కోసం సింగపూర్ తరలించారు. చికిత్స పొందుతూ అక్కడే మృతి చెందాడు హాదీ. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

ఈ ఘటనను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని ముహమ్మద్ యూనస్ తీవ్రంగా ఖండించారు. దేశానికి ఇది "తీరని లోటు" అని పేర్కొంటూ ఒకరోజు సంతాప దినం ప్రకటించారు. నిందితుడ్ని ఎట్టిపరిస్థితిల్లోనూ పట్టుకుంటామని పేర్కొన్నారు. ఈ మేరకు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న కరీమ్ మసూద్ కు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. ఇలా వరుస అల్లర్లతో బంగ్లాదేశ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. మరోవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల నేపథ్యంలో ఈ దాడులు ప్రజల్లో ఆందోళనను కలిగిస్తున్నాయి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications