హాలీవుడ్ తెరపై ఒబామా-మిచెల్లీ ప్రేమ కథా చిత్రం: ఒబామాకు అస్వస్థత

లాస్‌ఏంజెల్స్: అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ఆయన సతీమణి మిచెల్లీల ప్రేమకథ వెండితెరపై ప్రేక్షకులను అలరించనుంది. ‘సౌత్‌సైడ్‌ విత్‌ యు' పేరుతో హాలీవుడ్ దర్శకుడు రిచర్డ్‌ టేనీ వీరి ప్రేమకథకు దృశ్యరూపం ఇవ్వనున్నారు. మిచెల్లీ పాత్రకు టికా సంప్టర్‌ను ఎంపిక చేయగా, ఒబామా పాత్రధారి కోసం ఇంకా వేట కొనసాగుతోంది.

ఒబామా, మిషెల్లీ 1992లో పెళ్లిచేసుకోగా, అంతకుముందు మూడేళ్ల పాటు వీరిద్దరూ సహజీవనం చేశారు. ఒబామా-మిచెల్లీలా ప్రేమ కథా వివరాల్లోకి వెళితే.. అది 1989. చికాగో దక్షిణ ప్రాంతంలో వేసవికాలం. ఒక బక్క పలుచని కుర్రాడు అప్పుడే ఓ సాహసం చేశాడు. తన హృదయాన్ని కరిగించి.. ప్రేమలోతుల్లోకి దించిన యువతి చేతిలో చెయ్యి వేసి నాతో వస్తావా? అని అడిగాడు. ఆమె సై అంది. దీంతో అక్కడే అమెరికా భావి అధ్యక్షుడు, భావి ప్రథమ పౌరురాలు అన్యోన్యమైన ప్రేమకథకు బీజం పడింది.

కాగా, ఎప్పుడూ చిలుకా గోరింకలాగా చూడముచ్చటగా ఉండే బరాక్ ఒబామా-మిచెల్లీ దంపతుల ప్రేమకథపై తీస్తున్న సినిమా ఎలా ఉంటోందో మరి. సౌత్‌సైడ్ విత్ యూ పేరిట రూపొందుతున్న ఈ సినిమాలో 1989లో యవ్వనంలో ఉన్న ఒబామా, మిషెల్లీ ఎలా ప్రేమలో పడ్డారన్నదే ప్రధాన ఇతివృత్తమని డెడ్‌లైన్ పత్రిక తెలిపింది.

Barack and Michelle Obama's Love Story Will Be Made Into a Movie

అప్పట్లో బరాక్ కోరిక మేరకు మిచెల్లీ షికాగోలోని ఆర్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించేందుకు అంగీకరించింది. అక్కడ ‘డు ద రైట్ థింగ్ విత్ బరాక్' పేరిట స్పైక్ లీ ఏర్పాటుచేసిన ప్రదర్శన తిలకించింది. ఆమెను చూడగానే మనసు పారేసుకున్న ఒబామా వెంటనే ధైర్యం చేశాడు. తనతో డేట్‌కు వస్తావా? అని అడిగాడు. ఆమె అంగీకరించింది. ‘మేం అక్కడినుంచి నేరుగా వెళ్లిపోయాం. డేట్ అయిపోయేనాటికి నేను పూర్తిగా అతని సొంతమయ్యాను' అంటూ మిచెల్లీ నాటి అనుభవాలను నెమరేసుకున్నారు.

ఒబామాకు స్వల్ప అస్వస్థత

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గొంతునొప్పితోపాటు గొంతు పొడిబారిపోవటం వంటి సమస్యలతో బాధపడుతుండటంతో మేరీల్యాండ్‌లోని నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్‌లో ఆదివారం వైద్యపరీక్షలు నిర్వహించారు.

యాసిడ్ రిఫ్లెక్షన్‌తో ఒబామా అస్వస్థకు గురయ్యారని, పెద్ద ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనేందుకు ఇండియా రానున్న అమెరికా అధ్యక్షుడు ఒబామా నోరూరించే భారతీయ మసాలా వంటకాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+