గూగుల్ ఆఫీస్ లో వింత సమస్య..ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తాత్కాలికంగా ఆఫీసును మూసివేసి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ ఉద్యోగులకు ఈ మెయిల్స్ పంపించింది .ఇక ఆ ఈ మెయిల్స్ చూసిన google ఉద్యోగులు షాక్ అయ్యారు. అసలు ఇంతకీ గూగుల్ ఎందుకు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం చేయాలని సూచించింది. google ఆఫీస్ లో అసలు ఏం జరిగింది అంటే..
గూగుల్ కు చెప్పుకోలేని ఇబ్బంది
ప్రపంచ ప్రసిద్ధ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ నల్లుల బెడదను ఎదుర్కొంటుంది. తాజాగా google ఆఫీస్ లో నిశితంగా పరిశీలించిన ఒక స్నిపర్ డాగ్ ఆఫీసులో నల్లులు ఉన్నట్టు గుర్తించింది. న్యూయార్క్ లోని మాన్ హట్టన్ చెల్సియా క్యాంపస్లోని google ఆఫీస్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో గూగుల్ కు చెందిన పర్యావరణ, ఆరోగ్య, భద్రతాధికారులు ఈనెల 19వ తేదీన తమ ఉద్యోగులకు ఈమెయిల్ పంపించారు.

నల్లుల బెడద తగ్గేవరకు ఆఫీస్ కు రావద్దని ఈ మెయిల్స్
దాని ప్రకారం ఆఫీసులో నల్లుల బెడద ఎక్కువగా ఉందని, సమస్య పరిష్కారం అయ్యేవరకు ఎవరూ ఆఫీస్ కు రావద్దని తమ ఉద్యోగులకు తెలియజేశారు. ఇక నెలలకు సంబంధించి ఎవరికైనా దురద వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని సూచించారు. గూగుల్ లో పనిచేసే సిబ్బంది ఇళ్లల్లోనూ నల్లులు కనిపిస్తే వాటి నివారణకు సంబంధించిన ప్రొఫెషనల్ సంప్రదించాలని google తన ఉద్యోగులకు సూచించింది.
గూగుల్ కార్యాలయంలో నల్లుల బెడదకు కారణం ఇదే
ఇలా ఉంటే న్యూయార్క్ లోని గూగుల్ కార్యాలయంలో పెద్ద మొత్తంలో జంతువుల బొమ్మలు ఉంటాయి. ఈ జంతువుల బొమ్మలు ఉంచటం వలన నల్లుల బెడద పెరిగి ఉంటుందని కార్యాలయ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఇక ఉద్యోగులు నల్లుల బారినపడి ఏవైనా స్కిన్ ఎలర్జీలు, దురద వంటివి కనిపిస్తే దానికి సంబంధించిన నివేదికలు అందజేయాలని గూగుల్ పేర్కొంది. న్యూయార్క్ లోని గూగుల్ ఆఫీసులో నల్లుల బెడద ఘటన చోటు చేసుకోవడం ఇది రెండవసారి. 2010 సంవత్సరంలో కూడా ఇటువంటి ఘటనే గూగుల్ లో జరిగింది.












Click it and Unblock the Notifications