భారీ ఆకారంతో రోబో డైనోసార్లు, డైనో పార్క్‌కు ప్లాన్
టోక్యో: భారీ ఆకారం, అంతరించిన జంతువులు అంటే మనకు ముందుగా డైనోసార్లు గుర్తుకు వస్తాయి. డైనోసార్ల పైన జురాసిక్ పార్క్ వంటి సినిమాలు కూడా వచ్చాయి. అలాంటి డైనోసార్లను రోబో రూపంలో మన కళ్ల ముందు ఉంచేందుకు సిద్ధమైంది జపాన్‌కు చెందిన ఓ సంస్థ.

ఆ సంస్థ భారీ ఆకారంలో ఉండే రోబో డైనోసార్లను తయారు చేస్తోంది. జపాన్‌కు చెందిన ఆన్ ఆర్ట్ కార్ప్ అనే సంస్థ ఈ రోబో డైనోసార్లను రూపొందిస్తోంది. నిజమైన డైనోసార్లను అనుభూతికి తెచ్చే విధంగా పురాతన కాలంలో ఉన్న డైనోసార్ల కండర నిర్మాణాన్ని అధ్యయనం చేసి చేశాయి.
వాటి అస్థిపంజరాల నమూనాల ఆధారంగా ఈ రోబో డైనోసార్లను తయారు చేశారు. ఈ భారీ ఆకారపు రోబో డైనోసార్ల కదలికలు, అరుపులు నిజమైన వాటిలా ఉంటాయట. వీటిని ఆపరేట్ చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం జపాన్‌లోని వివిధ ప్రాంతాల్లో ఈ రోబోలను ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి రోబోలన్నింటితో ఒక డైనోసార్ పార్కును ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications