'తెల్ల' యువతికి చుక్కలు చూపిన 'నల్ల' అమ్మాయి (వీడియో)
ఒక్లాహామా: ఒక్లాహామాలో ఓ షాకింగ్ సంఘటన జరిగింది. తన జాతిని కించపరిచేలా మాట్లాడినందుకు ఓ నల్లజాతి యువతి.. తెల్లజాతి యువతికి చుక్కలు చూపించింది. తెల్లజాతి అమ్మాయి పైన ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.
ఇవి రికార్డయ్యాయి. ఇది ఇంటర్నెట్లో ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. ఒక్లాహామలో ఓ నల్లజాతి యువతి జాగింగ్‌కు వస్తున్న సమయంలో ఆమెకు ఓ తెల్లజాతి అమ్మాయి తారసపడింది. అప్పుడు నువ్వు ఎందులోనైనా పోటీ చేస్తున్నావా అని ప్రశ్నించింది.
అంతేకాదు, నల్లజాతి యువతికి చెందిన జాతిని కించపరిచేలా మాట్లాడింది. దీంతో తెల్లజాతి యువతితో వాగ్వాదానికి దిగింది. దాంతో తగ్గని తెల్లజాతి యువతి నీవు నా నేలపై ఉంటున్నావనే విషయం మర్చిపోవద్దని వ్యాఖ్యానించింది.
మరోసారి అంతకుముందు అన్న అసభ్యకరమైన మాటను మాట్లాడింది. దీంతో నల్లజాతి యువతి రెచ్చిపోయింది. ఒక్క పంచ్‌తో ఆ యువతిని కింద పడేసింది. వరుస పంచ్‌లతో ఆమెపై విరుచుకుపడింది. కొందరు ఆమె ఆగ్రహాన్ని చల్లబరిచారు.












Click it and Unblock the Notifications