లెబనాన్‌లో భారీ పేలుడు: ఆకాశాన్ని తాకిన పొగలు, మిస్టరీ వీడని ఘటన

లెబనాన్: హెజ్బోల్లా ప్రభావం బలంగా ఉన్న దక్షిణ లెబనాన్‌లో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. దీంతో ఓ గ్రామం మొత్తం పొగలు కమ్ముకున్నాయి. ఈ పేలుడుకు కారణాలు మాత్రం తెలియరాలేదు.

ఎయిన్ ఖానా అనే దక్షిణాది గ్రామంలో ఈ పేలుడు సంభవించింది. సిడాన్ పోర్టు సిటీకి ఇది దగ్గరలో ఉంటుంది. ఈ పేలుడు కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం ఏదైనా జరిగిందా? అనేది ఇంకా తెలియరాలేదు.

Blast rocks south Lebanon, security: Hezbollah house struck says source

ఈ ప్రాంతంలో పేలుడు జరిగిందని అంగీకరించిన షీటే మిలిటెంట్ గ్రూప్ హెజ్బోల్లా.. పేలుడుకు సంబంధించిన విషయాలేవీ చెప్పలేదు. ఈ ఘటనలో ఎంత మంది చనిపోయారనే విషయం కూడా తెలియదని మరో స్థానిక హెజ్బోల్లా అధికారి చెప్పారు. పేలుడుకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు తమకు ఎలాంటి అధికారం లేదని చెప్పారు.

కాగా, మీడియాను ఘటనా స్థలానికి చేరుకోకుండా ఈ గ్రూపు సభ్యులు అడ్డుకోవడం గమనార్హం. అయితే, దూరాన్ని కొంత మంది ఈ పేలుడుకు సంబందించిన వీడియోలను తీశారు. ఓ భవనం కుప్పకూలిందని స్థానిక అల్ జదీద్ స్టేషన్ ప్రసారం చేసింది.

లెబనాన్ రాజధాని నగరంలో బీరూట్‌లో ఇటీవల భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. బీరూట్ పోర్టులో సుమారు 3వేల టన్నుల అమ్మోనియం నైట్రేట్ పేలుడు పదార్థాలను ఉంచడమే ఈ ప్రమాదానికి కారణం. కాగా, ఈ పేలుళ్ల కారణంగా భారీ ఎత్తున ఆస్తి నష్టం జరగింది.

సుమారు 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, 6500 మంది గాయాలపాలయ్యారు. ఆ ప్రాంతం పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఏడాది కాలం పడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా మరో పేలుడు సంభవించడంతో అసలు అక్కడ ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+