కుక్కపిల్ల (పప్పీ) కోసం బాలిక ప్రాణం తీసిన బాలుడు
చికాగో: కుక్క పిల్ల(పప్పీ) కోసం ఇద్దరు చిన్నారుల మధ్య తలెత్తిన గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. 11ఏళ్ల బాలుడు తన పక్కింట్లో ఉంటున్న 8ఏళ్ల బాలికపై కాల్పులు జరపడంతో బాలిక ఆక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.
ఈ సంఘటన చికాగోలోని టెన్నస్సీ నగరంలో చోటు చేసుకుంది. బాలిక తల్లి లటాషా డయర్ చెప్పిన కథనం ప్రకారం తన కుమార్తె మెక్ కాయ్లా బయట కుక్క పిల్ల(పప్పీ)తో ఆడుకుంటుండగా ఇంటి పక్కనే ఉన్న ఓ 11ఏళ్ల బాలుడు చూశాడు.
తనకు ఒకసారి కుక్కపిల్లను ఇవ్వాలని కోరాడు. అందుకు పాప నిరాకరించడంతో ఆ బాలుడు ఇంట్లోకి వెళ్లి తన తుపాకీ తీసుకొచ్చి బాలిక చెస్ట్‌పై కాల్పులు జరిపాడు. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే చనిపోయింది.

గతంలో కూడా అదే బాలుడు తన కూతురితో సరదాగా ఆడుకుంటుండేవాడని, బాలికను పలు రకాల పేర్లతో పిలుస్తూ ఏడిపిస్తుండేవాడని... చివరకు ఇలా బాలికను చంపేస్తాడని తాను అస్సులు ఊహించలేదని బాలిక తల్లి లటాషా వాపోయింది.
తన కూతురంటే తనకు ఎంతో ఇష్టమని, తన కూతురు ప్రాణాలు తీసిన ఆ బాలుడు తన జీవితంలో ఎంత పెద్ద తప్పు చేశాడో తప్పక తెలుసుకుంటాడని WATE 6 న్యూస్ ఛానెల్‌తో పేర్కొంది. సమాచారం అందుకున్న జఫర్సన్ కంట్రీ షెరిఫ్ బడ్ మెక్‌కాగ్ బాలిడిపై ఫస్ట్ డిగ్రీ మర్డర్ కింద కేసు నమోదు చేశామని తెలిపారు.












Click it and Unblock the Notifications