గుడ్ న్యూస్.. 6 నుంచి 11 ఏళ్ల వారికి వ్యాక్సిన్.. ఏ టీకా.. ఎక్కడ అంటే..?

కరోనాకు టీకానే శ్రీరామ రక్ష.. ఇప్పటి వరకు అయితే వైరస్ ఇంపాక్ట్ తగ్గింది. భారత్‌లో మూడు వేవ్ ముగిశాయి. ఇతర దేశాల్లో అదీ 4 వేవ్స్‌గా ఉంది. అయితే వ్యాక్సిన్‌కు సంబంధించి బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారులకు కూడా టీకా వేసేందుకు అనుమతి ఇచ్చింది. మోడెర్నా టీకాను ఆరు నుంచి 11 ఏళ్ల వయస్సు గల వారికి ఇచ్చేందుకు బ్రిటన్ మెడిసిన్స్ రెగ్యులేటర్ ఆమోదం తెలిపింది. వాస్తవానికి బ్రిటన్‌లో కొత్త కొత్త వేరియంట్స్ పుట్టుకొస్తున్నాయి. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కూడా ఇక్కడే ఆవిర్భవించింది.

Recommended Video

    COVID-19 : దేశంలో మళ్ళీ కరోనా ఆందోళన... Britain లో చిన్నారులకు కూడా వాక్సిన్ | Oneindia Telugu

    మోడెర్నా టీకా వేయడానికి మెడిసన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ ఆమోదం తెలిపింది. చిన్నారుల సేప్టీ ముఖ్యం అని.. అందుకోసమే క్వాలిటీతో కూడిన సురక్షితమైన టీకాలు ఇవ్వాలని స్పష్టంచేసింది. బ్రిటన్‌లో ఇప్పటికే చిన్నారులు మైల్డ్ సింప్టమ్స్ పొందుతున్నారు. మరికొందరికీ ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. కొత్త వేరియంట్ భయాందోళన కలిగిస్తోందిని తెలిపారు. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ కరోనా కేసులు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

    Britain approves Modernas Covid shot for 6-11 year-olds

    ఇంగ్లండ్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రతీ 14 మందిలో ఒక కేసు వచ్చింది. గత వారంలో అదీ 13గా ఉండేంది. స్పైక్ వాక్స్ వ్యాక్సిన్.. ఇప్పటికే అనుమతి ఇచ్చింది. 12.. ఆపై వయస్సు గలవారికి వ్యాక్సిన్ ఇవ్వడానికి అంగీకరించింది. 6 నుంచి 11 ఏళ్ల పిల్లలకు టీకా వేయడానికి మోడెర్నా పర్మిషన్ ఇచ్చే ముందు ట్రయల్స్ జరిపారు. సురక్షితం అని తేలినక అనుమతి ఇచ్చారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+