లేటు వయసులో ఘాటు ప్రేమ: బ్రిటన్ ప్రధాని మూడో పెళ్లి: సీక్రెట్‌గా
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్.. మూడో పెళ్లి చేసుకున్నారు. తన ఫియాన్సీ క్యారీ సైమండ్స్‌ను ఆయన పెళ్లాడారు. బ్రిటన్ కాలమానం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ రోమన్ క్యాథలిక్ క్యాథడ్రల్‌లో ఈ వివాహ కార్యక్రమం ముగిసింది. బోరిస్ జాన్సన్ రహస్యంగా వివాహం చేసుకున్నారని, అత్యంత ఆప్తులు పరిమితంగా మాత్రమే దీనికి హాజరైనట్లు అక్కడి మీడియా వెల్లడించింది. దీనిపై బోరిస్ జాన్సన్ అధికారిక కార్యాలయం 10 డౌనింగ్ స్ట్రీట్ ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు.
దీనిపై వ్యాఖ్యానించడానికీ నిరాకరించినట్లు మీడియా పేర్కొంది. బోరిస్ జాన్సన్ వయస్సు 56 సంవత్సరాలు. ఇదివరకే ఆయనకు రెండుసార్లు వివాహమైంది. న్యాయవాది మెరినా వీలర్‌ను ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. నలుగురు సంతానం. 2018 సెప్టెంబర్‌లో బోరిస్ జాన్సన్, వీలర్ విడిపోయారు. ఆ తరువాత 2019లో జాన్సన్.. క్యారీ సైమండ్స్‌తో సహజీవనం ఆరంభించారు. వారికి ఓ కుమారుడు ఉన్నాడు. బ్రిటన్‌లో అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీలో సైమండ్స్ క్రియాశీలకంగా పనిచేస్తోన్నారు.

ఇటీవలే క్యారీ సైమండ్స్ మీద కొన్ని ఆరోపణలు సైతం వెలువడ్డాయి. ప్రధానమంత్రి అధికారిక నివాసంలో ఉంటూ అపరిమితంగా ఖర్చు చేస్తున్నారంటూ వార్తలొచ్చాయి. తన కార్యాలయం 10 డౌనింగ్ స్ట్రీట్ నుంచి ప్రత్యక కారులో వారిద్దరూ అర్ధరాత్రి దాటిన తరువాత 1:30 నిమిషాలకు రోమన్ క్యాథలిక్ క్యాథడ్రల్‌కు వెళ్లారు. చివరి నిమిషంలో ఆప్తులకు సమాచారం ఇచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో బ్రిటన్‌లో పలు ఆంక్షలు అమల్లో ఉన్న విషయం తెలిసిందే. వివాహాలకు హాజరయ్యే ఆహ్వానితుల సంఖ్యను పరిమితం చేసింది బోరిస్ జాన్సన్ ప్రభుత్వం. 30 మందికి మాత్రమే అనుమతి ఉంది.
Recommended Video
బోరిస్ వివాహానికి 30 మంది కూడా హాజరు కాలేదని మీడియా పేర్కొంది. అతికొద్ది మంది ముఖ్యులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నట్లు తెలిపింది. బోరిస్ జాన్సన్ తండ్రి స్టాన్లీ సహా పరిమితంగా బంధువులు, మంత్రివర్గ సహచరులు హాజరైనట్లు పేర్కొంది. దీనిపై 10 డౌనింగ్ స్ట్రీట్ ఎలాంటి వ్యాఖ్యలు గానీ, ప్రకటన గానీ చేయలేదు. నార్తర్న్ ఐర్లాండ్ ఫస్ట్ మినిస్టర్ అర్లెన్ ఫోస్టర్, సహా కొందరు అధికార పార్టీ నేతలు బోరిస్ జాన్సన్‌ను అభినందిస్తూ సందేశాలు పంపించారు.












Click it and Unblock the Notifications