రిషి సునాక్ సంచలనం: ఆ ఒక్క మాటతో ఉన్నఫళంగా..

లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ (Rishi Sunak) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య కొనసాగుతున్న యుద్ధం తీవ్రతరమౌతోండటం, దీనికి వ్యతిరేకంగా బ్రిటన్‌లో నివసిస్తోన్న వేలాదిమంది పాలస్తీనియన్లు రోడ్డెక్కి నిరసన తెలియజేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

బ్రిటన్ హోం శాఖ మంత్రి సువెల్లా బ్రేవర్‌మన్ (Suella Braverman)ను ఉన్నఫళంగా పదవి నుంచి తొలగించారు. ఆమెకు ఉద్వాసన పలికారు. దీనిపై ఎలాంటి ముందస్తు సంకేతాలను కూడా ఇవ్వలేదు రిషి సునాక్. మంత్రివర్గం నుంచి సువెల్లాను తొలగిస్తూ ఆదేశాలను జారీ చేశారు. అదే సమయంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకూ పూనుకున్నారు.

British PM Rishi Sunak sacked minister Suella Braverman for this reason

కొన్ని రోజులుగా ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. దాదాపుగా గాజా స్ట్రిప్‌లోకి ప్రవేశించింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. సరిహద్దులను దాటుకుని లోపలికి వచ్చేసింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 11,100 మంది మరణించారు. లక్షలాదిమంది గాయపడ్డారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఈ యుద్ధానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాల్లో నివసిస్తోన్న పాలస్తీనియన్లు ఆందోళనకు దిగుతున్నారు. తరచూ రోడ్లపైకి వస్తోన్నారు. నిరసన ప్రదర్శనలను చేపడుతున్నారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా.. ఇలా ఏ ఒక్క దేశం కూడా దీనికి మినహాయింపు కాదు.

లండన్ సహా బ్రిటన్‌లో కొనసాగుతున్న పాలస్తీనియన్ల ఆందోళనపై కీలక వ్యాఖ్యలు చేశారు హోం శాఖ మంత్రి సువెల్లా బ్రేవర్‌మన్. గత శనివారం జరిగిన పాలస్తీనియన్ల మార్చ్‌పై పోలీసులు దాడి చేయడంపై సువెల్లా స్పందించారు. పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడారు. నిరసనలను తెలియజేస్తోన్న పాలస్తీనియన్లపై పోలీసులు దౌర్జన్యానికి దిగారంటూ అభివర్ణించారు.

British PM Rishi Sunak sacked minister Suella Braverman for this reason

ఈ నిరసన ప్రదర్శనలను పోలీసులు ద్వేషపూరిత చర్యగా పేర్కొనడాన్ని సువెల్లా తప్పుపట్టారు. లండన్ పోలీసులు తమ నిబంధనలను అతిక్రమిస్తోన్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఆమెను పదవి నుంచి తప్పించాలంటూ డిమాండ్లు చెలరేగాయి.

ఈ నేపథ్యంలో ఆమెను పదవి నుంచి తప్పించారు రిషి సునాక్. ఈ యుద్ధంలో బ్రిటన్ ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఇటీవలే రిషి సునాక్.. ఇజ్రాయెల్‌లోనూ పర్యటించారు. ఆర్థిక, సైనిక సహాయ, సహకారాలను అందజేస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ సమయంలో సువెల్లా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆమెపై చర్యకు దిగారు. సువెల్లా పూర్వీకులు గోవాకు చెందిన వారు. వ్యాపారరీత్యా లండన్‌లో స్థిరపడ్డారు. ఆమె అక్కడే జన్మించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+