Romance in helicopter: హెలీకాఫ్టర్‌లో సైనికుల శృంగార కేళి.. మద్యం మత్తులో బట్టలు లేకుండా..

Apache helicopter: శృంగారానికి కాదేదీ అనర్హం అన్న రీతిలో తయారైంది ప్రస్తుతం సమాజం. నాలుగు గోడల మధ్య జరగాల్సిన సంసారం కాస్తా నలుగురిలో కానిచ్చేందుకు ఇప్పటి జనరేషన్ వెనకాడటం లేదు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా బాత్‌రూమ్‌లో ఓ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ఇటీవల ప్రియురాలితో శృంగారం చేసిన విషయం బయటకు పొక్కింది. తాజాగా అటువంటిదే మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది.

ఇద్దరు బ్రిటీష్ సైనికులు ఎక్కడా ప్లేస్ దొరకనట్లు అపాచీ హెలికాప్టర్‌లో సెక్స్ చేస్తూ పట్టుబడటం సైనిక వర్గాల్లో కలకలం రేపింది. వారిరువురు మద్యం మత్తులో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఒంటిపై దుస్తులు లేని స్థితిలో గ్రౌండ్ సిబ్బందికి కనిపించినట్లు స్థానిక మీడియా తెలిపింది. సాధారణ హెలీకాఫ్టర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సమయంలో కాక్‌పీట్‌ లోపల లైంగిక చర్యకు పాల్పడినట్లు సమాచారం.

British soldiers making love in Apache helicopter were caught

ఆర్మీ ఎయిర్ కార్ప్స్‌కు చెందిన AH-64 గన్‌షిప్‌కు గ్రౌండ్ సిబ్బంది సర్వీసింగ్ పూర్తి చేశారు. అనంతరం వారికి ఏదో తేడాగా అనిపించింది. దాదాపు 90 కోట్ల విలువైన అపాచీ హెలికాప్టర్ పైకి క్రిందికి ఊగుతున్నట్లు గమనించారు. దీనికితోడు లోపల నుంచి వింత శబ్దాలు వస్తుండటం దీనికి మరింత ఆజ్యం పోసింది. తీరాచూస్తే ఆ ఇరువురు సైనికులు కూర్చునే సెక్స్ చేస్తూ కనిపించారు. గ్రౌండ్ సిబ్బంది గన్‌షిప్‌పై రెయిన్ కవర్లు అమర్చే పనిలో ఉండగా ఇదంతా జరిగింది.

పురుష సైనికుడు యూనిఫాంలో ఉండగా మహిళా సైనికురాలు సివిల్ దుస్తుల్లో ఉన్నట్లు తెలిసింది. విషయం గుర్తించిన అధికారులు వారిద్దరినీ దుస్తులు ధరించి హెలికాప్టర్‌ నుంచి దిగాలని ఆదేశించారు. ఈ మేరకు మిలిటరీ ఏవియేషన్ అథారిటీకి నివేదిక అందించారు. 653 స్క్వాడ్రన్ చైన్ ఆఫ్ కమాండ్ మరియు వారి పేరెంట్ యూనిట్ వచ్చే వరకు వారిని నిర్బంధించినట్లు అందులో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+