నిత్య యవ్వనం కోసం గుర్రం హార్మోన్ ఎక్కించుకుని.. కట్ చేస్తే.. మెదడు ఛిద్రమై..
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన వ్యాపారవేత్త బ్రియాన్ జాన్సన్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ముసలివాడిగా ఉండటం ఈయనకు అసలు ఇష్టం ఉండదు. నిత్య యవ్వనంగా ఉండాలని ఎప్పుడూ తీవ్రంగా శ్రమిస్తుంటారు. ప్రస్తుతం ఆయన వయసు 50 ఏళ్లు. అయితే ఎల్లప్పుడూ 18 ఏళ్ల యువకుడిగా ఉండాలని.. 18 ఏళ్ల వయస్సులో తాను ఎలా ఉండేవాడో తిరిగి ఆ రూపం తెప్పించుకోవాలన్న కోరికతో అతడు వైద్యులను సంప్రదించారు. ఇక ఆలివర్ జోల్మాన్ నేతృత్వంలోని డాక్టర్ల బృందం జాన్సన్‌కు వృద్ధాప్య ఛాయలు రాకుండా నిత్యం యువకుడిలా కనిపించేలా చికిత్స చేస్తామని హామీ ఇచ్చింది. చికిత్స తర్వాత శరీర దారుఢ్యం, ఊపిరితిత్తుల సామర్థ్యం 18 ఏళ్ల యువకుడిలా, గుండె పని తీరు 37 ఏళ్ల వ్యక్తిలా, చర్మం నిగారింపు 28 ఏళ్ల మగవాడిలా మారినట్లు జాన్సన్ మీడియాకు వెల్లడించారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

అయితే తాజాగా మరో సంచలన ప్రయోగం చేశారు బ్రియాన్ జాన్సన్. ఇప్పటివరకూ శరీరంపైనే తన ప్రయోగాలు చేసిన జాన్సన్ మరో అడుగు ముందుకేశారు. మెదడులోని ఆలోచనలు కూడా యవ్వనంగా ఉండాలన్న కోరికతో గుర్రం హార్మోన్ కెటామైన్ ను స్వయంగా తానే గుర్రం నుంచి తీసి తన శరీరంలోకి ఎక్కించుకున్నారు. ఆ తర్వాత ఆయన్ను 30 మంది వైద్యుల బృందం 15 రోజుల పాటు క్షుణ్ణంగా పరిశీలించింది. అయితే ఈ ప్రయోగం అనంతరం జాన్సన్ మీడియాతో మాట్లాడారు.
" నేను గుర్రాల హార్మోన్ కెటామైన్ ను నా శరీరంలోకి ఎక్కించుకున్నాను. 15 రోజుల పాటు నా శరీరాన్ని పరీక్షించాను. చాలా మార్పులు వచ్చాయి. నా మెదడు ఛిద్రమైంది. మొత్తం ఆలోచన విధానం మారిపోయింది. కెటామైన్ హార్మోన్ తీసుకోక ముందు.. తీసుకున్న తర్వాత నా మెదడు, శరీరంలో ఎలాంటి మార్పులు వచ్చాయో గమనించాను.
I injected the horse tranquilizer Ketamine and tracked my brain data for 15 days. It completely scrambled my brain.
— Bryan Johnson /dd (@bryan_johnson) February 18, 2025
In a world-first we answered the question ‘what happens to the brain before, during, and after ketamine treatment?’ We also discovered how long it took for my… pic.twitter.com/UFcS0Bumhn
రెండు మూడు రోజుల్లోనే నా మెదడులోని ఆలోచనలో మార్పులు వచ్చాయి. 15 రోజుల తర్వాత నా మైండ్ సాధారణ స్థితికి వచ్చింది." అని జాన్సన్ చెప్పుకొచ్చారు.ఇందుకు సంబంధించిన పూర్తి వీడియోను సామాజిక మాధ్యమమైన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications