భారత్ సహకరించాలంటూనే మళ్లీ అవే ఆరోపణలు చేసిన జస్టిన్ ట్రూడో
ఒట్టావా: ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌పై మరోసారి అవే కూతలు కూశారు. నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించారు. తమ వద్ద విశ్వసనీయ సమాచారం, కారణాలు ఉన్నాయని తెలిపారు. కాగా, ఖలిస్థాన్ వేర్పాటువాదానికి మద్దతు పలుకుతూ.. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదిగా గుర్తించింది.
అయితే, హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను జస్టిన్ ట్రూడో మాత్రం కెనడియన్ పౌరుడిగానే ప్రస్తావించారు. ఇటీవల తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లు ట్రూడో ప్రకటించారు. ఎవరైనా పౌరుడిని సొంత దేశంలోనే హత్య చేయడం ఆమోదయోగ్యం కాదని.. తాము చట్ట పాలన కోసం నిలబడుతున్నామని ట్రూడో వ్యాఖ్యానించారు.

తాము భారత్‌ను రెచ్చగొట్టడం లేదని అంటూనే.. ఈ హత్య కేసు విచారణలో భారత్ సహకారం కావాలని కోరారు జస్టిన్ ట్రూడో. కెనడా పౌరులను సురక్షితంగా ఉంచాలని తమ ప్రభుత్వం చూస్తోందని.. నిజ్జర్ హత్య కేసును సీరియస్‌గా తీసుకోవాలని భారత్‌కు ట్రూడో సూచించారు.
#WATCH | Canadian PM Justin Trudeau says, "I call upon the Govt of India to work with us, to take seriously these allegations and to allow justice to follow its course."
— ANI (@ANI) September 21, 2023
(Source: Reuters) pic.twitter.com/lVhnLQNSwG
నిజ్జర్ హత్యపై తాను ప్రధాని నరేంద్ర మోడీతో సూటిగా, స్పష్టంగా మాట్లాడానని.. తన ఆందోళనను పంచుకున్నానని ట్రూడో చెప్పారు. కెనడాకు స్వతంత్ర న్యాయవ్యవస్థ, బలమైన ప్రక్రియ ఉన్నాయని తాము దాన్ని అనుసరిస్తామని చెప్పారు. భారత్ ప్రాముఖ్యత గల దేశం అనడంలో ఎలాంటి సందేహం లేదని.. తాము ఒక రీజియన్ లోనే కాకుండా ప్రపంచమంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ట్రూడో చెప్పుకొచ్చారు.
కాగా, ఖలిస్థాన్ టైగర్ ఫ్రంట్ పేరుతో ఓ ఉగ్రవాద సంస్థను నడిపిస్తున్న హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో హత్యకు గురయ్యాడు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇతడ్ని భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా గుర్తించింది. ఇతనిపై మనదేశంలోనూ పలు కేసులు నమోదయ్యాయి.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications