Justin Trudeau : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు భారీ షాక్-తాజా సర్వేలో 50 ఏళ్లలోనే చెత్తగా..
భారత మోస్ట్ వాంటెడ్ ఖలిస్తాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ కెనడాలో హత్యకు గురైన తర్వాత ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అదే సమయంలో నిజ్జార్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా పార్లమెంటులో ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ప్రకటన ఇరుదేశాల మధ్య సంబంధాల్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఆ తర్వాత పరస్పరం దౌత్యవేత్తల బహిష్కరణ, హెచ్చరికలు జారీ చేసుకోవడం, వీసాల నిలిపివేత వంటి చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో భారత్ తో అమీతుమీకి దిగుతున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్వదేశంలో మాత్రం ప్రజాదరణ కోల్పోతున్నారు. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో అత్యధికులు ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారు. ఆయన కంటే కెనడా విపక్ష నేత పియరేకు జనంలో అత్యధిక మద్దతు లభించింది. అంతే కాదు గత 50 ఏళ్లలో కెనడాలో అత్యంత చెత్త ప్రధానిగా కూడా జస్టిన్ ట్రూడో నిలిచారు. దీంతో ట్రూడో పరిస్దితి నానాటికీ దారుణంగా మారుతోందని అర్ధమవుతోంది. అయినా ఆయన మాత్రం భారత్ వ్యతిరేకతను కొనసాగిస్తున్నారు.

కెనడాలో తాజాగా నిర్వహించిన Ipsos పోల్ ప్రకారం 40 శాతం మంది కెనడియన్లు ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ నేత పియరీ పోయిలీవ్రేను ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నారని తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పొయిలీవర్ కన్జర్వేటివ్‌లకు 39 శాతం ఓట్లు వస్తాయని పోల్ పేర్కొంది. 2015లో ఎన్నికై లిబరల్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న ట్రూడో 30 శాతం ఓట్లతో సరిపెట్టుకుంటారని కెనడా గ్లోబల్ న్యూస్ నివేదించింది.
ఇప్పుడు ఎన్నికలు జరిగితే ట్రూడో నేతృత్వంలోని లిబరల్ మైనారిటీ అనుకూల ప్రభుత్వం స్ధానంలో కన్జర్వేటివ్‌లు మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని తాజా పోల్ పేర్కొంది. వాస్తవానికి కెనడాలో 2025 చివరలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ జూలైలో 50 ఏళ్లలో ట్రూడో అత్యంత చెత్త ప్రధానమంత్రి అని ప్రత్యేక సర్వేలో తేలింది. అయితే ట్రూడో తండ్రి 1968 నుండి 1979 వరకు, 1980 నుండి 1984 వరకు ప్రధాన మంత్రిగా పనిచేసిన పియరీ ట్రూడో కు కెనడియన్ ఓటర్లలో ప్రజాదరణ ఉంది.












Click it and Unblock the Notifications