Family: ముస్లీంలు అని పగ, ట్రక్ తో తొక్కించి ఒకే ఫ్యామిలీలో నలుగురి హత్య, మహిళలు !
కెనడా: కెనడాలో దారుణం జరిగింది. ముస్లీంలు అని పగతో ఒకే కుటుంబంలో నలుగురిని అతి దారుణంగా హత్య చేశారు. రేస్ డ్రెస్ లో ట్రక్ నడుపుకుంటూ వెళ్లిన కిరాతకుడు అదే ట్రక్ తో నలుగురిని తొక్కించి చంపేయడం కలకలం రేపింది. ఇదే ప్రమాదంలో 9 ఏళ్ల బాలుడికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. నలుగురిని దారుణంగా చంపేసిన నిందితుడు దర్జాగా మాల్ లో షాపింగ్ చేస్తూ పోలీసులకు చిక్కిపోయాడు.

ఒకే ఫ్యామిలీలో నలుగురు
కెనడాలోని ఒంటారియా ప్రాంతంలో 74 సంవత్సరాల ముస్లీం వృద్దుడు నివాసం ఉంటున్నారు. ఈ ముస్లీం పెద్దతో పాటు ఆయన ఇంటిలో నివాసం ఉంటున్న 46 ఏళ్ల మహిళ, 44 ఏళ్ల మహిళ, 14 సంవత్సరాల అమ్మాయి మీద నడిరోడ్డు పక్కన వేగంగా ట్రక్ నడిపి అదే వాహనంతో తొక్కించి అతి దారుణంగా హత్య చేశాడు.

మాల్ లో హంతకుడు
ముస్లీం కుటుంబంలోని నలుగురిని అతి దారుణంగా హత్య చేసిన నాథలిన్ వెల్ట్ మన్ అనే నిందితుడు హత్య జరిగిన ప్రాంతం సమీపంలోని 7 కిలో మీటర్ల దూరంలోని ఓ మాల్ లో షాపింగ్ చేస్తూ చిక్కాడని కెనడా పోలీసు అధికారులు అన్నారు. ఇదే ప్రమాదంలో తీవ్రగాయాలైన 9 సంవత్సరాల బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారులు తెలిపారు.

పగతో హత్యకు స్కెచ్
ముస్లీం కుటుంబం మీద ద్వేషం, పగతో రేస్ డ్రెస్ వేసుకుని ట్రక్ నడిపి అతి కిరాతకంగా హత్య చేశానని నిందితుడు అంగీకరించాడని పోలీసు అధికారులు తెలిపారు. ఇప్పటికే నాథలిన్ మీద హత్య, హత్యాయత్నం కేసులు నమోదు అయ్యాయని, ఉగ్రవాద నిరోదక చట్టం కింద కేసు నమోదు చెయ్యవచ్చా ? లేదా అని ఆలోచిస్తున్నామని, న్యాయనిపుణులతో చర్చిస్తున్నామని కెనడా పోలీసు అధికారులు తెలిపారు.

ధైర్యం చెప్పిన ప్రధాని
ఒకే కుటుంబంలో నలుగురు దారుణ హత్యకు గురి కావడంతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రిడో ఆదేశంలోని ముస్లీంలకు ధైర్యం చెబుతూ ఓ ట్విట్ చేశారు. హత్యకు గురైన కుటుంబ సభ్యుకు కెనడా ప్రధాని సానుభూతి తెలిపారు. ఒకే కుటుంబంలో నలుగురు దారుణ హత్యకు గురి కావడం కెనడాలో కలకలం రేపింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications