Canada-India:మోడీకి వ్యతిరేకంగా ఆధారాల్లేవ్ కానీ..నిజ్జర్ హత్య కేసుపై కెనడా సంచలన ఆరోపణలు

Canada-India:కెనడాకు చెందిన ఓ వార్తాపత్రిక నిజ్జర్ హత్య కేసులో ప్రధాని మోడీ పేరును ప్రస్తావిస్తూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే.తాజాగా ఆ ప్రకటనపై కెనడా సర్కారు స్పందించింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకేసులో భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఉన్నతాధికారులకు సంబంధంపై ఎలాంటి ఆధారాలు లేవని కెనడా సర్కారు ప్రకటించింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటన నేపథ్యంలో కెనడా మీడియాలో వచ్చిన సంచలన కథనంలో ప్రధాని మోడీని ప్రస్తావించడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆ కథనాలు అవాస్తమని భారత్ వెల్లడించింది.

నిజ్జర్ హత్య గురించి ప్రధాని మోడీకి సమాచారం ఉందని కెనడా మీడియా ప్రకటించగా..దానిని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది.కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఓ జాతీయ భద్రతా అధికారి నిజ్జర్ హత్యను ప్లాన్ చేశారని కెనడాకు చెందిన మీడియా ఆరోపించింది.ఈ హత్య ఘటనలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్,భారత విదేశాంగ శాఖ మంత్రి భాగమైనట్లు కెనడాకు చెందిన ది గ్లోబ్ అండ్ మెయిల్ వార్తాపత్రికలో ఇటీవల ఓ కథనం ప్రచురితమైంది.

Canadian Authorities Reject Report Suggesting PM Modi Knew of Nijjar Plot

భారత ప్రధాని మోడీ పేరును కూడా ప్రస్తావిస్తూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది.దీనిపై భారత్ తీవ్రంగా మండిపడింది.అవన్నీ హాస్యాస్పద వార్తలే అని కొట్టిపడేసింది.ఇలాంటి దుష్ప్రచారాలు రెండు దేశాల మధ్య సంబంధాలను దిగజారుస్తాయని హెచ్చరించింది.ఈ క్రమంలోనే కెనడా తాజాగా ప్రకటన విడుదల చేయడం విశేషం.ప్రధాని మోడీకి ఈ హత్య కేసులో సంబంధాలపై ఎలాంటి ఆధారాల లేవని కెనడా ప్రభుత్వం ప్రకటించింది.నిరాధార ఆరోపణలకు కెనడా సర్కారు దూరంగా ఉంటుందని పేర్కొంది.

కెనడా ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించిన అనంతరం జస్టిన్ ట్రూడో సర్కారు ఈ మేరకు స్పందించింది. ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందనే కెనడా ఆరోపణలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. నిజ్జర్ 2023 జూన్ లో గురుద్వారా బయట హత్యకు గురయ్యాడు. ఈ కేసులో కెనడా అధికారులు నలుగురు భారతీయులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+