Cannes Film Festival 2023:రాజమౌళి RRRకు షాక్...సన్నీ లియోన్‌కు ఎంట్రీ..!
కొద్ది రోజుల క్రితం ఆస్కార్ అవార్డులతో సినిమా ఇండస్ట్రీలో పండగ వాతావరణం నెలకొంది. కొంత గ్యాప్ తర్వాత మరో పది రోజుల పాటు మరో వేడుకకు హాలీవుడ్ సిద్ధమైంది. అదే కాన్స్ ఫిలిం ఫెస్టివల్. మే 16వ తేదీన 76వ ఎడిషన్ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభం కానుంది. కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు రెడ్ కార్పెట్ స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంది. ఈ ఏడది కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు భారత్ నుంచి ఎవరెవరు వెళుతున్నారో ఇప్పుడు చూద్దాం.
ప్రతిష్టాత్మక కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఈసారి విరాట్ కోహ్లీ భార్య ప్రముఖ హీరోయిన్ అనుష్క శర్మ హాజరు కానుంది. ప్రస్తుతం ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌కు మద్దతు తెలుపుతూ స్టేడియంలో తన భర్త విరాట్‌క ముద్దులు విసురుతూ కనిపిస్తూ ఉంటుంది. ఈ సారి ప్రెస్టీజియస్ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై ఈ ముద్దుగుమ్మ ప్రత్యక్షం కానుంది.

కాన్స్ ఫిలిం ఫెస్టివల్ అంటే ఏంటి..?: అంతర్జాతీయ సినిమాను ఒక వేడుకగా ఏటా జరుపుకోవడమే కాన్స్ ఫిలిం ఫెస్టివల్ యొక్క ప్రత్యేకత. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దర్శకులు, నటీనటులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సినీ విమర్శకులందరినీ ఒకే వేదికపైకి తీసుకొస్తుంది కాన్స్ ఫిలిం ఫెస్టివల్.కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు మంచి గుర్తింపుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా ఇండస్ట్రీ నుంచి బెస్ట్ మూవీస్ ఇక్కడ స్క్రీనింగ్ అవుతాయి.ఇక ఈ ఫెస్టివల్‌లో అన్ని రంగాల్లో ఉన్న నిపుణులు, నిష్ణాతులే జ్యూరీ సభ్యులుగా ఉంటారు.

కాన్స్ ఫిలి ఫెస్టివల్ ఎప్పుడు ఎక్కడ..?: కాన్స్ ఫిలిం ఫెస్టివల్ ఈ ఏడాది మే 16 మంగళవారం నుంచి మే 27 శనివారం వరకు జరుగుతుంది. ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ రివేరియా ప్రాంతంలోని కాన్స్ అనే పట్టణంలో ఈ వేడుకను గ్రాండ్‌గా నిర్వహిస్తారు. ఇక ఈ వేడుకను నేరుగా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ అధికారిక వెబ్‌సైట్ పై వీక్షించొచ్చు. అంతేకాదు కాన్స్ ఫిలి ఫెస్టివల్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ పై కూడా వీక్షించొచ్చు.

కాన్స్ ఫిలిం ఫెస్టివల్ 2023లో భారత్ నుంచి ఎన్ని సినిమాలు..?: ఆస్కార్‌లో సత్తా చాటిన పాన్ ఇండియా మూవీ RRRకు కాన్స్‌లో నిరాశే మిగిలింది. అయితే కాను భేల్ చిత్రం ఆగ్రా ప్రదర్శించబడుతుంది. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన కెన్నెడీ చిత్రం కూడా ప్రదర్శించబడుతుంది. ఇందులో సన్నీ లియోన్ ప్రధాన పాత్ర పోషించింది.లా సినెఫ్ సెక్షన్‌లో యుధాజిత్ బసు చిత్రం నెహిమిక్ మూవీని కూడా ప్రీమియర్ చేయనున్నారు.క్లాసిక్ కేటగిరీలో మణిపూరి చిత్రం ఇషాన్హోను ప్రదర్శించడం జరుగుతుంది.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన











Click it and Unblock the Notifications