ప్యారిస్: డైలమా, ఉగ్రవాదుల కోసం 5 హెలికాప్టర్లు, వేలాది పోలీసులు
ప్యారిస్: ప్యారిస్‌లో ఉగ్రవాదులను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉగ్రవాదులు ఈశాన్య ఫ్రాన్సులోని డమార్టన్ ఎస్ గోయిల్ పట్టణంలో ఓ ప్రింటింగ్ ప్రెస్ గోదాములో దాక్కున్నారు. వారితో సంప్రదింపులు జరుపుతూనే.. పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఉగ్రవాదులు బందీలను అడ్డం పెట్టుకున్నారు. దీంతో పోలీసులకు ఏం చేయాలో తోచటం లేదు. ఉగ్రవాదులు ఉన్న గిడ్డంగి పైన హెలికాప్టర్ నిరంతరాయంగా తిరుగుతూ సమీక్షిస్తోంది. డమార్టన్ ఎస్ గోయల్ పట్టణాన్ని భద్రతా దళాలు పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి.
పట్టణంలో రాకపోకలు నిషేధించారు. ప్రజలు బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు. ఈ ఆపరేషన్లో వేలాది మంది పోలీసులు పాల్గొంటున్నారు. ఐదు హెలికాప్టర్లు వినియోగిస్తున్నారు. ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు ప్యారిస్ నగరాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు.

పోలీసులు ఉగ్రవాదులు ఉన్న బిల్డింగును చుట్టుముట్టారు. శుక్రవారం నాడు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఎవరు కూడా మృతి చెందలేదని ఫ్రాన్స్ అధికారులు చెప్పారు. ఉదయం ఒకరి మృతి చెందినట్లు మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు.
కోషేర్ సూపర్ మార్కెట్ వద్ద కాల్పులు
కేషెర్ సూపర్ మార్కెట్ వద్ద కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు యెమెన్‌లో శిక్షణ పొందినట్లుగా అనుమానిస్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications