వీడియో: రష్యాలో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. ఐదుగురు మృతి
రష్యాలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతుల్లో యుద్ధ విమానాల పరికరాల తయారీ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. హెలికాప్టర్ ఆకస్మాత్తుగా ఒకేసారి నేలను ఢీకొట్టడంతో తోక భాగం ముక్కలైంది. దీంతో ప్రమాదం సంభవించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హెలికాప్టర్ నేలకు ఢీ కొట్టడంతో తోక భాగం తెగిపోయి వేలాడింది. అయినా పైలట్ హెలికాప్టర్ ను నడిపే ప్రయత్నం చేశాడు. అలా కొంచెం ముందుకెళ్లి ఓ ఇంటిపై పడింది. దీంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటల్లో హెలికాప్టర్ లోని ఏడుగురు ప్రయాణికుల్లో ఐదుగురు సజీవ దహనం అయ్యారు. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
రష్యాలోని కాస్పియన్ సముద్ర తీరంలో ఉన్న రష్యన్ డాగేస్తాను ప్రాంతంలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు సిబ్బంది మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. యుద్ధ విమానాల విడి భాగాలు తయారు చేసే సిబ్బందితో ఆర్మీ హెలికాప్టర్ ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా నేలకు ఢీ కొట్టడంతో తోక భాగం తెగిపోయింది.
❗️The moment of yesterday's Ka-226 helicopter crash in 🇷🇺Dagestan with employees of the military plant "Kizlyar Electromechanical Plant"
— 🪖MilitaryNewsUA🇺🇦 (@front_ukrainian) November 8, 2025
The accident killed the deputy general director, chief engineer and chief designer pic.twitter.com/JVVKEWc43E
దీంతో హెలికాప్టర్ అలా కొద్దిసేపు గాల్లోనే ప్రయాణించి దగ్గరలో ఉన్న ఓ ఇంటిపై పడింది. దీంతో మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో విమానంలోని ఐదుగురు సజీవదహనం అయ్యారు. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. హెలికాప్టర్ గాలిలో చక్కర్లు కొడుతున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సాంకేతిక లోపం కారణంగానే విమానం కుప్పకూలినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

జెన్ హువా న్యూస్ కథనం ప్రకారం.. దక్షిణ రష్యాలోని డాగేస్తాన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు రష్యా మంత్రి యారోస్లావ్ గ్లాజోవ్ స్పష్టం చేశారు. ఈ హెలికాప్టర్ లో రష్యాలో ఎయిర్ క్రాఫ్ట్ పరికరాలను తయారు చేసే కిజ్ల్యార్ ఎలక్ట్రోమెకానికల్ ప్లాంట్ కు చెందిన ఏడుగురు సిబ్బంది ఉన్నారని తెలిపారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications