సూప్‌లో మూత్ర విసర్జన: బిజినెస్ దెబ్బతీయడానికే!, చైనాలో వింత సంఘటన
బీజింగ్: ప్రత్యర్థుల్ని అధిగమించాలంటే వాళ్ల కంటే గొప్పగా ఆలోచించగలగాలి. బుర్రకు పని చెప్పకుండా కేవలం అక్కసు పెంచుకున్నంత మాత్రానా ఒరిగేది ఏమి ఉండదు.
పైగా ఉన్న కాస్తో.. కూస్తో పరువు కూడా పోగొట్టుకుని రోడ్డు మీద నిలబడాల్సి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చైనాలోని హైకౌలో ఓ నూడుల్ షాప్ యజమాని కూడా చేజేతులా ఇదే పరిస్థితి తెచ్చుకున్నాడు.

ఇంతకీ అసలు విషయమేంటంటే.. హైకౌలోని ఓ నూడుల్ షాప్ యజమాని.. తాను తయారుచేస్తున్న సూప్‌లో ఇటీవల ఓ తేడాను గుర్తించాడు. సూప్ వింత వాసన రావడం గమనించాడు. ఎందుకిలా అవతుందో తెలుసుకోవడానికి షాపులో సీసీటివి కెమెరాలను అమర్చాడు. అప్పుడు గానీ అసలు విషయం అర్థం కాలేదు.
తన ప్రత్యర్థి అయిన మరో నూడుల్ షాప్ యజమాని.. తన షాపులోకి వచ్చినప్పుడల్లా.. సూప్ గిన్నెలో మూత్ర విసర్జన చేస్తున్నట్టుగా అతను గుర్తించాడు. మార్చి 28వ తేదీన సీసీటీవి ఫుటేజీని పరిశీలించగా ఈ విషయం బయటపడింది. వ్యాపారాన్ని దెబ్బతీయడానికే అతనీ చర్యకు పాల్పడ్డాడని తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications