బర్త్‌డే గిఫ్టుగా ఇచ్చిన తుపాకీతోనే 9మందిని చంపాడు
న్యూయార్క్: అమెరికాలోని కరోలినా చర్చ్‌లో బుధవారంరాత్రి ప్రార్థనలు చేసుకుంటున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి తొమ్మిదిమంది ప్రాణాలు తీసిన శ్వేతజాతి యువకుడు డిలాన్ స్టార్మ్ రూఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం డిలాన్ జైలులో ఉన్నాడు.
ఆశ్చర్యకర విషయమేమిటంటే.. తన తండ్రి తన పుట్టిన రోజుకు కానుకగా ఇచ్చిన తుపాకీతోనే డిలాన్.. చర్చిలో కాల్పులకు తెగబడ్డాడు. నల్లజాతీయులు ఎక్కువగా ప్రార్థనలు చేసుకునే చర్చిలో.. జాత్యహంకారంతోనే ఈ దాడికి పాల్పడినట్లు స్పష్టమవుతోంది.
డిలాన్ ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడు. డిలాన్‌తో కలిసి చదువుకున్నవారిలో పెక్కుమంది ఇతడిని గుర్తుపట్టడంలేదు. ఎవరితోనూ పెద్దగా కలిసే వ్యక్తికాదని ఒక యువకుడు చెప్పినట్టు మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. అయితే డిలాన్‌కు జాత్యహంకార ఆలోచనలు చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఎప్పుడూ ఆఫ్రో అమెరికన్లపై జోక్‌లు వేసేవాడని వారు చెబుతున్నారు. అయితే వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని మరో విద్యార్థి చెప్పాడు. ఫేస్‌బుక్ పేజీలో పెట్టిన ఫొటోలో డిలాన్ చొక్కాకు రెండు పతాకాలు పెట్టుకుని కనిపించాడు. అందులో ఒకటి జాత్యహంకార పాలననాటి దక్షిణాఫ్రికా పతాకం, అలాగే రెండవది రొడీషియా పతాకం. వీటినిబట్టి డిలాన్‌కు చాలాకాలంగానే జాత్యహంకార ఆలోచనలు ఉన్నట్టు అర్థమవుతోంది.
మృతులతో ఎలాంటి సంబంధం, వ్యతిరేకత లేనప్పటికీ ఈ దారుణానికి పాల్పడ్డాడు మిలాన్. దుర్ఘటన జరిగిన ఇమాన్యుల్ ఆఫ్రికన్ మెథాడిస్ట్ ఎపిస్కోపల్ చర్చ్ వద్ద మృతులకు భారీ ఎత్తున ప్రజలు నివాళి అర్పించారు. ఈ ఘటన నేపథ్యంలో అమెరికాలో తుపాకీ సంస్కృతిని రూపుమాపవలసి ఉందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గురువారం రాత్రి పిలుపు ఇచ్చారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications