Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సరిహద్దులో అత్యాధునిక స్టెల్త్ యుద్ద విమానాలు మోహరించిన చైనా: భారత్ కౌంటర్ ఇలా

చైనా మరోసారి సరిహద్దులో కవ్వింపు చర్యలకు దిగింది. సిక్కిం సరిహద్దుకు 150 కిలోమీటర్ల దూరంలో చైనా తన అత్యాధునిక యుద్ధ విమానాలను మోహరించింది. మే 27న సేకరించిన ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. సిక్కింకు 150 కిలోమీటర్ల దూరంలో సైనిక, ప్రజల అవసరాల కోసం వినియోగించే ఎయిర్‌పోర్ట్‌ను చైనా నిర్మించింది.

టిబెట్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన షిగాట్సేలో 12,408 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఎయిర్‌పోర్ట్‌ ప్రపంచంలోని ఎత్తైన విమానాశ్రయాలలో ఒకటి. ఈ ఎయిర్‌పోర్ట్‌లో ఆరు అధునాతన జే-20 ఫైటర్‌ జెట్‌లను చైనా మోహరించింది. ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ కేజే-500 కూడా ఇక్కడ ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించే సంస్థ పేర్కొంది.

China Deploys most advanced J-20 Stealth Fighters Just 150 Km From Sikkim Border

కాగా, సిక్కిం సమీపంలో జే-20 యుద్ధ విమానాలను చైనా మోహరించడం గురించి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ఐఏఎఫ్‌)కు తెలుసని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనికి కౌంటర్‌గా పశ్చిమ బెంగాల్‌లోని హసిమారా ఎయిర్‌బేస్‌లో 16 రాఫెల్స్‌ యుద్ధ విమానాలతో రెండవ స్క్వాడ్రన్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించాయి. కాగా, టిబెట్‌లో చైనా J-20 మోహరించడం ఇదే మొదటిసారి కాదు.

2020, 2023 మధ్య చైనాలోని హోటాన్ ప్రిఫెక్చర్‌లోని జిన్‌జియాంగ్‌లో జెట్‌లు గమనించబడ్డాయి. చెంగ్డు J-20, మైటీ డ్రాగన్ అని కూడా పిలుస్తారు, ఇది 2017లో సర్వీస్‌లోకి వచ్చింది. ఇది ట్విన్ ఇంజన్ స్టెల్త్ ఫైటర్. అయితే, చైనా ఇప్పటికే 250 వరకు J-20 జెట్లను మోహరించి ఉంచవచ్చని, వీటిని ఉపగ్రహ చిత్రాలు గుర్తించకుండా ఉండొచ్చని భావిస్తున్నారు.

కాగా, J-20 స్టీల్త్ ఫైటర్ ఇప్పటి వరకు చైనా అత్యంత అధునాతనమైన ఆపరేషనల్ ఫైటర్ జెట్. ఈ విమానాలు ప్రధానంగా చైనాలోని తూర్పు ప్రావిన్సులో ఉన్నాయని సమాచారం. అయితే, అందుకు భిన్నంగా వీటిని భారత సరిహద్దుల వద్ద మోహరించారని ప్రముఖ జియో‌స్పేషియల్ విశ్లేషకుడు సిమ్ టాక్ తెలిపారు. భారత్ ప్రస్తుతం 36 ఫ్రెంచ్- నిర్మిత రాఫెల్ యుద్ధవిమానాలతో J-20ని ఎదుర్కొంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+