లదాక్‌ను యూటీగా గుర్తించబోం - చైనా రెచ్చగొట్టే ప్రకటన - ఇండియాదే ఆక్రమణంటూ..

సరిహద్దు వెంబడి ఐదు నెలలుగా కొనసాగుతోన్న ఉద్రిక్తతల్ని మరింత పెంచేలా చైనా రెచ్చగొట్టే ప్రకటనలకు దిగుతున్నది. భారత్ అంగీకరించని 1959నాటి ఎల్ఏసీ ఒప్పందం ప్రకారం.. మన భూభాగంలోని ప్రాంతాలను తనవిచెప్పుకుంటోన్న డ్రాగన్.. తాజాగా లదాక్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని తాము గుర్తించబోమంటూ ప్రకటన చేసింది.

భారత ప్రభుత్వం చట్ట విరుద్ధంగా ఏర్పాటు చేసిన లదాక్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని గుర్తించబోమని, సరిహద్దులోని పశ్చిమ చైనా భూభాగంపై భారత్ పరిపాలనా అధికార పరిధిలోకి చేరడాన్ని తాము ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నామని, ఈ విషయంలో తమ వైఖరి మారబోదని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్‌ వ్యాఖ్యానించారు.

China says it does not recognise UT of Ladakh; India hits back

బీజింగ్ లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సరిహద్దుల్లో భారత్ ఆక్రమణలకు పాల్పడుతున్నదని, సైనిక నిర్మాణాలు చేపట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చైనా చైనా విదేశాంగ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్‌ అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీ నుంచి లదాక్ లోని లేహ్ వరకు భారత్ నిర్మించిన సొరంగ మార్గం(అటల్ టన్నెల్)పై ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

సరిహద్దు ఒప్పందాలకు విఘాతం కలిగేలా అక్కడి పరిస్థితులను క్లిష్టతరం చేసేలా భారత్ కార్యకలాపాలు చేస్తున్నదని, ఇకనైనా భారత్ కట్టుబాట్లను గౌరవించాలని వెన్బిన్ అన్నారు. భారత్ ఆరోపిస్తున్నట్లుగా ఎల్ఏసీ వెంబడి తాము అక్రమ నిర్మాణాలు చేపట్టలేదని, తమ భూభాగంలోనే మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎల్ఏసీ సమీపంలో చైనా కొత్తగా సైనిక శిబిరాలను నిర్మించినట్లు వస్తున్న వార్తలను వాంగ్ ఖండించారు. కాగా, చైనా వాదనను భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. సార్వభౌమత్వం విషయంలో రాజీపడబోమని, ఎల్ఏసీపై చైనా వాదనను తిరస్కరిస్తున్నామని విదేశాంగ శాఖ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+