చైనా షాకింగ్ నిర్ణయం.. ఆ ఇద్దరు మిలిటరీ ఉన్నతాధికారుల తొలగింపు.. కారణం ఇదే..

చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. తన మిలిటరీ కమాండ్ బాడీ అయిన సెంట్రల్ మిలిటరీ కమిషన్ నుంచి ఇద్దరు సీనియర్ మిలిటరీ అధికారులను తొలగించింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తొలగించిన వారిలో జాంగ్ యూగ్జియా, లియూ జెన్లీ ఉన్నారు. క్రమశిక్షణ, చట్టాన్ని అతిక్రమించడం లాంటి తీవ్రమైన అభియోగాలు వాళ్లపై రావడంతో జిన్ పింగ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. గతనెల ఇదే అంశంపై ఆ దేశాధినేత మాట్లాడుతూ ఆర్మీలో అవినీతిని అరికట్టాలని పిలుపునిచ్చారు. ఇక ప్రస్తుతం వీరిపై విచారణకు జిన్ పింగ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.

జాంగ్.. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కింద సెకండ్ ఇన్ కమాండ్ పదవిలో ఉన్నాడు. సెంట్రల్ మిలిటరీ కమిషన్ లో వైస్ ఛైర్మన్ పదవిలో ఉన్నారు. అలాగే చైనాకు చెందిన ఎలైట్ పొలిట్ బ్యూరో లోనూ సభ్యుడిగా ఉన్నారు. అలాగే లియూ కూడా సెంట్రల్ మిలిటరీ కమిషన్ లో సభ్యుడిగా ఉన్నారు. సీఎంసీ జాయింట్ స్టాఫ్ డిపార్ట్ మెంట్ లో సభ్యుడిగా కూడా ఉన్నారు. జిన్ పింగ్ 2012 లో తీసుకొచ్చిన అవినీతి నిర్మూలన నిబంధనల మేరకు వీరిని ఆర్మీ నుంచి తొలగించినట్లుగా తెలుస్తోంది.

ఇక సైన్యంలో అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేతలకు జిన్ పింగ్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయంలో భాగంగా సైన్యంలోని అనేకమంది ఉన్నతాధికారులు, అత్యున్నతస్థాయి జనరల్స్ పై విచారణ జరపడమే కాకుండా వారిని పదవుల నుంచి తొలగించడం అలాగే సైన్యం నుంచి తొలగించడం తదితర చర్యలను ఆ దేశాధ్యక్షుడు జిన్ పింగ్ తీసుకున్నారని రాయిటర్స్ సంస్థ నివేదించింది.

ఈ మేరకు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ప్రచురించిన డిప్యూటీల జాబితా నుంచి జాంగ్ అలాగే లీయూ పేర్లను తొలగించడంతో ఇప్పటికే తొలగించిన 10 మంది సభ్యులను కూడా కలుపుకుని మొత్తం 12 మంది చట్టసభలో తమ స్థానాలను కోల్పోయారు. ఈ 12 మందిలో సీఎంసీ జనరల్ ఆఫీస్ మాజీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ జోంగ్ షావోజూన్ అలాగే సైనిక వ్యూహాత్మక సహాయక దళం మాజీ కమాండర్ జనరల్ జూ కియాంగ్ షెంగ్ ఉన్నారు. అలాగే ఈ జాబితాలో దక్షిణ చైనా నగరమైన నాన్ చాంగ్ మాజీ మేయర్ గావో షివెన్ కూడా ఉండటం గమనార్హం. ఈయన గతంలో ప్రభుత్వ యాజమాన్యంలోని ఏరోస్పేస్, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పనిచేశారు.

China shocking decision Removal 2 top military officials Here is the reasonChina latest Zhao Zongqi

మరోవైపు వీరితోపాటు చైనా సైన్యంలో కీలక జనరల్, 2017 డోక్లామ్, 2020 గాల్వాన్ ఘర్షణకు బాధ్యుడిగా ఉన్న జావో జోంగ్‌ కిపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చర్యలు తీసుకున్నారు. ఆయన్ను చైనీస్ పీపుల్స్ పొలిటిషియన్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ నుంచి తప్పించడంతో పాటుగా మరో రెండు కీలక పదవుల నుంచి కూడా తొలగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+