Love Holidays: కాలేజీ విద్యార్థులకు ప్రేమ సెలవులు.. వారం రోజుల పాటు ఏమైన చేసుకోవచ్చు..!
డ్రాగన్ దేశం చైనా వినూత్న నిర్ణయం తీసుకుంది. యువ జంటలు ప్రేమించుకోవడానికి సెలవులు కూడా ఇస్తోంది. కాలేజీ విద్యార్థులను ప్రేమించుకోవడానికి బయటకు కూడా పంపుతోంది. ఇంతకీ ఇదంతై ఎందుకు చేస్తుందంటే.. ఎక్కువ మంది పిల్లలను కనాలని చైనా ప్రభుత్వం పోత్సహిస్తోంది. దేశంలో వృద్ధ జనాభా పెరిగిందని.. అందుకే యువత కోసం ఎక్కువ మంది పిల్లల్ని కనాలని కోరుతోంది.
అందుకే కళాశాల విద్యార్థులకు ప్రేమించుకోవడానికి సెలవులు కూడా ఇస్తోంది. కొన్ని స్కూల్స్, కాలేజీలు దేశంలో బర్త్ రేట్ ను పెంచేందుకు విద్యార్థులకు వారం రోజుల పాటు 'లవ్ హాలిడేస్' పేరుతో సెలవులను ప్రకటించినట్లు చైనా మీడియా తెలిపింది. ఈ సెలవులను ఏప్రిల్ 1 నుంచి 7 వరకు ప్రేమించుకోవడానికి హాలిడేస్ ఇచ్చింది. చెంగ్డులోని సిచువాన్ సౌత్‌వెస్ట్ వొకేషనల్ కాలేజ్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ "ఫ్లోటింగ్ స్ప్రింగ్‌పై హాలిడే నోటీసు" ఇచ్చింది.

సర్క్యులర్‌లో "విద్యార్థులు తరగతి గదిని విడిచిపెట్టి, క్యాంపస్‌ను విడిచిపెట్టి, ప్రకృతిని ఆస్వాదించండి" అని పేర్కొన్నారు.జియామెన్ విశ్వవిద్యాలయం కూడా తన విద్యార్థులకు వారం మొత్తం సెలవును మంజూరు చేసింది. మరోవైపు ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే చైనా ప్రభుత్వం రాయితీలు ఇస్తోంది. ఇటీవలే.. ఆర్మీ సోల్జర్లకు పిల్లల్ని కనడానికి సెలవులు ఇచ్చింది. "ఇది ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండటానికి ప్రజలను నెట్టివేసే మరో ప్రయత్నం అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను" అని చైనీస్ సోషల్ మీడియాలో ఓ వ్యక్తి రాసుకొచ్చాడు.












Click it and Unblock the Notifications