టాయిలెట్ కు వెళ్లాలంటే HR అనుమతి తీసుకోవాలి.. ఆ కంపెనీ కండిషన్..!
ప్రతి కంపెనీకి కొన్ని రూల్స్, రెగ్యూలైజేషన్స్ ఉంటాయి. వాటిని బట్టి ఉద్యోగులు నడుచుకుంటారు. అయితే ఈ కంపెనీ తీసుకొచ్చిన రూల్ వింటే మీరు షాక్ అవుతారు. ఈ కంపెనీ ఉద్యోగులు టాయిలెట్ కు వెళ్లాలంటే HR అనుమతి తీసుకోవాల్సిందే. అంతేకాక వాష్ రూమ్ కు కేవలం 2 నిమిషాలే వెళ్లాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ కంపెనీ ఏది..? ఎక్కడ ఉందో తెలుసా..?

చైనా లోని ఫోషన్ నగరానికి చెందిన త్రీ బ్రదర్ మెషైన్ మానుఫ్యాక్చరింగ్ కంపెనీ.. తమ ఉద్యోగుల కోసం వింత విధానాన్ని తీసుకొచ్చింది. టాయిలెట్ యూసేజ్ మేనేజ్ మెంట్ రూల్ పేరుతో ఓ కొత్త విధానాన్ని ప్రారంభించింది. ఈ రూల్ ప్రకారం ఉద్యోగులు టాయిలెట్ కు వెళ్లాలంటే HR అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ రూల్ ప్రకారం ఉద్యోగులకు టాయిలెట్ కు వెళ్లేందుకు కేవలం 2 నిమిషాలే టైమ్ దొరుకుతుంది.
ఈ రెండు నిమిషాలు కూడా స్లాట్స్ ప్రకారం ఉంటుంది. ఎవరి స్లాట్ వస్తే వాళ్లు వెళ్లి పని ముగించుకుని రావాలి. ఎప్పుడుపడితే అప్పుడు వెళ్లేందుకు వీలు లేదు. ఉద్యోగికి టాయిలెట్ కు వెళ్లేందుకు రెండు నిమిషాల కంటే ఎక్కువ సమయం కావాలంటే HR పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఫిబ్రవరి 11 నుంచి ఈ రూల్స్ అమల్లోకి వచ్చాయట. మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఈ రూల్స్ అందుబాటులోకి వస్తాయని కంపెనీ వివరించింది.
అయితే ఉద్యోగుల ఆరోగ్యం కోసమే తాము ఈ రూల్ ప్రవేశపెట్టినట్లు త్రీ బ్రదర్ మెషైన్ మానుఫ్యాక్చరింగ్ కంపెనీ చెప్పుకొచ్చింది. వారి ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది. ఈ కంపెనీని నెటిజెన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications