Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉద్యోగి మెంటల్ హెల్త్ కోసం 'అన్ హ్యాపీ లీవ్'.. ఎక్కడో తెలుసా..?

సాధారణంగా ఉద్యోగులు అత్యవసర సమయాల్లో లేదా అనారోగ్యం బారిన పడినప్పుడు లీవ్ లు పెడతారు. అయితే ఓ కంపెనీ మాత్రం తమ ఉద్యోగులకు వినూత్న అవకాశాన్ని కల్పించింది. ఈ విధానం ప్రకారం ఉద్యోగులు సంతోషంగా లేకపోయినా కూడా లీవ్ పెట్టొచ్చు. అలా ఏడాదికి 10 సార్లు లీవ్ తీసుకోవచ్చు. ఉద్యోగుల వర్క్- లైఫ్ బ్యాలెన్స్ కోసం ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. మరి ఈ విధానం ఎక్కడుందో తెలుసా..?

చైనాలోని ఓ కంపెనీ ఉద్యోగి మెంటల్ హెల్త్ కోసం అన్ హ్యాపీ లీవ్ ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ రూల్ సామాజిక మాధ్యమాల్లో చర్చగా మారింది. ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు అన్ హ్యాపీ లీవ్ అనే రూల్ ను తీసుకొచ్చింది. ఉద్యోగులు సంతోషంగా లేనప్పుడు, ఒత్తిడిగా ఫీల్ అవుతున్నప్పుడు ఈ రూల్ ను వినియోగించుకుని అన్ హ్యాపీ లీవ్ తీసుకోవచ్చు. అలా ఏడాదికి 10 సార్లు ఈ లీవ్ తీసుకోవచ్చు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటే మరింత ఉత్సాహంగా, సమర్థవంతంగా పని చేయవచ్చని ఆ సంస్థ అభిప్రాయపడుతోంది.

Chinese Company s Unhappy Leave Policy Sparks Social Media Buzz

చైనాలోని హెనాన్ ప్రావిన్స్ కు చెందిన పాంగ్ డాంగ్ లై అనే రిటైల్ కంపెనీ ఈ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఆ కంపెనీ ఛైర్మన్ యూ డాంగ్ లాయి ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ హ్యాపీ లీవ్ లో భాగంగా ఉద్యోగులు ఏటా 10 సార్లు ఈ లీవ్ తీసుకోవచ్చు. తనకు ప్రతి ఉద్యోగి స్వాతంత్ర్యం ముఖ్యం. ప్రతి ఉద్యోగి ఒకానొక సమయంలో అన్ హ్యాపీ ఫీల్ అవుతారు. అలాంటి సమయంలో విధులకు రావాల్సిన అవసరం లేదు.. అని కంపెనీ ఛైర్మన్ యూ డాంగ్ లాయి తెలిపారు. చైనాలో జరిపిన ఓ అధ్యయనంలో 65 శాతం మంది ఉద్యోగులు అలసిపోయినట్లుగా లేదా అన్ హ్యాపీగా ఉన్నట్లు తేలింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+