Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షాక్: భర్తకు పంచ్ మిషన్ పెట్టిన భార్య, 9 గంటల్లోపు రాకపోతే ఫైన్

సమయానికి ఇంటికి భర్త రాకపోతే జరిమానా విధిస్తోంది ఓ భార్య. అంతేకాదు తాను నిర్ధేశించిన టైమ్ టేబుల్ ను పాటించకపోతే వారంతపు పనులను పూర్తి చేయాల్సిందేనని భర్తకు షరతు విధించింది.ఈ మేరకు భార్య విధించిన షరతు

బీజింగ్: సమయానికి ఇంటికి భర్త రాకపోతే జరిమానా విధిస్తోంది ఓ భార్య. అంతేకాదు తాను నిర్ధేశించిన టైమ్ టేబుల్ ను పాటించకపోతే వారంతపు పనులను పూర్తి చేయాల్సిందేనని భర్తకు షరతు విధించింది.ఈ మేరకు భార్య విధించిన షరతులను సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆపీసు పని పూర్తైన తర్వాత ఇంటికి రాకుండా స్నేహితులు, పార్టీలంటూ తిరిగే భర్తలకు దిమ్మతిరిగే షాకిచ్చింది చైనాకు చెందిన ఓ మహిళ. రాత్రిపూట 9 గంటలలోపు ఇంటికి చేరుకోకపోతే జరిమానా చెల్లించాల్సిందే.

Chinese Wife Installs Punch Card Machine to Get Husband Home Before 9pm

అయితే తన భర్త సమయానికి ఇంటికా రాకపోవడం, తనతో పాటు పిల్లలతో గడపకపోవడంతో ఆమె కూడ బాధపడింది.అయితే దీనికి ఓ పరిష్కారాన్ని కనుక్కొంది.ఈ మేరకు వినూత్నంగా ఆలోచించింది.

ఉద్యోగులు సమయానికి వస్తున్నారో లేదో తెలుసుకొనేందుకు బయోమెట్రీక్ మెషీన్లను ఏర్పాటు చేసినట్టుగానే అదే తరహా మెషీన్ ను ఆ మహిళ తన ఇంటి ముందు ఏర్పాటు చేసింది.

రాత్రి 9 గంటలలోపుగా ఇంటికొచ్చి పంచ్ కొట్టాలని భర్తను ఆదేశించింది. ఒకవేళ అతను 9 గంటలలోపుగా ఇంటికి వచ్చి పంచ్ కొట్టాలి. లేకపోతే ఆ రోజుకు వండిన గిన్నెలను తానే కడిగేస్తోంది.

రాత్రి తొమ్మిదిన్నర గంటలలోపు వస్తే వంద యాన్ల జరిమానా విధిస్తోంది. తొమ్మిదిన్నర గంటలు దాటితే వారంతంలో ఇంట్లో పనులన్నీ భర్తే చేయాలని నిబంధనలను రాసిపెట్టింది.

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. కొందరు భర్త స్వేచ్చను హరిస్తున్నారని చెప్పారు. మరికొందరు ఇలా చేయడం సబబేని మరికొందరు కామెంట్ చేశారు. తాము కూడ ఇదే పనిని చేస్తామంటూ పలువురు మహిళా నెటిజన్లు ప్రకటించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+