ఆరోజు ఉ.కొరియా నుంచి మరో షాక్ తప్పదా?: అమెరికాకు సీఐఏ హెచ్చరిక..
అక్టోబర్ 9న కొలంబస్ డే సందర్భంగా అమెరికాను ఉత్తరకొరియా మరోసారి రెచ్చగొట్టే అవకాశాలున్నాయి.
ప్యోంగ్‌యాంగ్: అగ్రరాజ్యం అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఉత్తరకొరియా.. మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉందని సీఐఏ వర్గాలు వెల్లడించాయి.
అక్టోబర్ 9న కొలంబస్ డే సందర్భంగా అమెరికాను ఉత్తరకొరియా మరోసారి రెచ్చగొట్టేందుకు ప్రయత్నించవచ్చునని సీఐఏ(సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ) హెచ్చరించింది. యాథృచ్చికంగా అదే రోజు ఉత్తరకొరియాలో వర్కర్స్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావడం గమనార్హం.

సీఐఏ డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ యాంగ్ సుక్ లీ వాషింగ్టన్ యూనివర్సిటీలో జరిగిన ఓ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరకొరియా దాడులకు సంబంధించి యాంగ్ లీ ఎలాంటి ఊహాగానాలు వ్యక్తం చేయనప్పటికీ.. గతంలో కిమ్ జాంగ్ ఉన్ పుట్టిన రోజు, అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం, ఇతరత్ర దినోత్సవాల సందర్భంగా ఆ దేశం అణు ప్రయోగాలు చేసిందని గుర్తుచేస్తున్నారు.
అదే పరంపరలో అక్టోబర్ 10వ తేదీన అమెరికాపై ఉత్తరకొరియా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడవచ్చునన్న ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications