కరోనావైరస్: చైనాలో ఆరు నెలల తర్వాత మళ్లీ తెరుచుకుంటున్న సినిమా హాళ్లు.. పాటించాల్సిన నియమ, నిబంధనలు ఇవీ..

చైనాలోని ఒక సినిమా హాలులో క్రిమి సంహారక రసాయనాన్ని చల్లుతున్న సిబ్బంది

చైనాలో కరోనావైరస్ మహహ్మారిని నియంత్రించటం కోసం ఆరు నెలలుగా మూసివేసిన సినిమా హాళ్లు మళ్లీ తెరుచుకుంటున్నాయి.

తక్కువ ముప్పు ఉన్న ప్రాంతంలోని సినిమా థియేటర్లను సోమవారం నుంచి పునఃప్రారంభించవచ్చునని చైనా ఫిల్మ్ అడ్మినిస్ట్రేషన్ చెప్పింది.

దేశంలోని చాలా భాగం ఇప్పుడు తక్కువ ముప్పు ఉన్న ప్రాంతంగా వర్గీకరించిన నేపథ్యంలో.. దాదాపు దేశమంతటా థియేటర్లు తెరుచుకుంటాయి.

చైనా సినిమా హాళ్లు లాక్‌డౌన్ కారణంగా జనవరి నుంచి మూతబడటంతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా థియేటర్లు వ్యాపారం నుంచి వైదొలగాల్సి వచ్చింది.

పాటించాల్సిన నియమ, నిబంధనలు ఇవీ..

అయితే.. ఇప్పుడు మళ్లీ తెరుస్తున్న సినిమా థియేటర్లలో కఠినమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.

  • థియేటర్లలో ప్రేక్షకుల సామర్థ్యాన్ని 30 శాతానికి పరిమితం చేశారు.
  • ప్రదర్శించే సినిమా షోల సంఖ్యను కూడా సగానికి తగ్గించారు.
  • థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు జ్వరం ఉందేమో తనిఖీ చేస్తారు.
  • ప్రేక్షకులతో పాటు, థియేటర్లలోని సిబ్బంది సైతం ఎల్లప్పుడూ మాస్కులు ధరించి ఉండటం తప్పనిసరి.
  • టికెట్లను ఆన్‌లైన్‌లో మాత్రమే కొనుగోలు చేయాలి.
  • ప్రేక్షకులు ఒకరికొకరు కనీసం ఒక మీటరు దూరంలో మాత్రమే కూర్చోవాలి.
  • థియేటర్లలోకి ఎటువంటి తినుబండారాలు, పానీయాలు అనుమతించరు.

థియేటర్ల ఆదాయంలో ఇవి గణనీయమైన భాగంగా ఉండేవి. ఇప్పుడు వీటికి అనుమతించకపోవటం థియేటర్లకు మరో పెద్ద దెబ్బ.

కోవిడ్ ప్రబలిన తొలి దేశమైన చైనా.. సినిమాలకు ప్రపంచంలో రెండో అతిపెద్ద మార్కెట్. 2019లో దేశంలో బాక్స్ ఆఫీస్ వసూళ్లు 920 కోట్ల డాలర్లుగా ఉంది.

కానీ థియేటర్ల మూసివేతతో పాటు దేశీయ, హాలీవుడ్ సినిమాల విడుదల నిలిచిపోవటమో, ఆన్‌లైన్‌లోకి మారటమో జరగటంతో ఈ వసూళ్లు దారుణంగా పడిపోనున్నాయి.

చైనాలో అతి పెద్ద సినిమా థియేటర్ల యజమాని వాండా ఫిల్మ్ సంస్థకు దేశవ్యాప్తంగా 600కు పైగా సినిమా థియేటర్లు ఉన్నాయి.

ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 160 కోట్ల యువాన్ల భారీ నష్టం చవిచూస్తామని ఈ నెల ఆరంభంలో ప్రకటించింది. ఈ సంస్థ గత ఏడాది ఇదే కాలానికి 52.4 కోట్ల ఆదాయం ఆర్జించింది.

Click here to see the BBC interactive

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

కరోనావైరస్ హెల్ప్ లైన్
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+